తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు డిల్లీలో కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి సమక్షంలో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. గతవారం ఇద్దరు చంద్రులు కలిసి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అపెక్ష్ కౌన్సిల్ సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఓ ఆసక్తిని రేకెత్తించే అంతా ఆత్మానందంతో పొంగిపోయే ఓ గొప్ప సంఘటన చోటు చేసుకుందంటూ చంద్రబాబు బయటకొచ్చి పొంగుపోతూ పక్కన ఉన్న పరివారానికి చెప్పాడంట. అదేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.. చంద్రబాబు చెప్పిన మాటను గౌరవించాడంట. దాంతో బాబు ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఎంతో ఖుషీ ఖుషీగా బయటకొచ్చి ఈరోజు చాలా ఆనందంగా ఉందంటూ తెగ మురిసిపోతూ మంత్రులతో ఆ విషయాన్ని ముచ్చటించుకున్నాడంట.
విషయం ఏంటంటే పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాన్ని గురించి చర్చించుకుంటున్నప్పుడు వాటికి అనుమతులు లేవని తాను స్పష్టం చేసిన సమయంలో, దానికి కేంద్ర అధికారులు కూడా ఇదే విషయాన్నే పరిగణలోకి తీసుకున్నారంట. అంతే ధీటుగా ఈ విషయంపై తెలంగాణా అధికారులు కూడా అందుకు వ్యతిరేకంగా జీవోలు ఉన్నాయి కదా అని తెలపారంట. అందుకు కేంద్ర అధికారులు కేంద్రం నుంచి అనుమతి లేకుండా జీవోలు ఎలా రాస్తారు? అలాంటి జీవోలు చెల్లవు అని స్పష్టం చేయడంతో, ఒక్కసారిగా కెసిఆర్ ఊగిపోతూ కోపంతో బయటకి లేచి వచ్చాడంట. అప్పుడు చంద్రబాబు కలగజేసుకొని మెల్లిగా కేసీఆర్ ను దువ్వాడంట. ‘సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. వచ్చి కూర్చోండి’ అని చంద్రబాబు చెప్పడంతో కెసీఆర్ వెంటనే వచ్చి కూర్చున్నాడంట. అబ్బబ్బా తానంటే ఎంత గౌరవమో కేసీఆర్ కు అంటూ మంత్రులు కూడా పొంగిపోయి మరీ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారంట. ఇదీ విషయం. మొత్తానికి చంద్రబాబు చాలా కాలానికి సంబరాల్లో మునిగి తేలాడు.