Advertisementt

ఈ రైటర్ డైరెక్టర్ అయ్యేది ఎప్పుడో..?

Thu 29th Sep 2016 05:15 PM
vakkantham vamsi,ntr,janatha garage,koratala siva,vakkantham vamsi direction chance  ఈ రైటర్ డైరెక్టర్ అయ్యేది ఎప్పుడో..?
ఈ రైటర్ డైరెక్టర్ అయ్యేది ఎప్పుడో..?
Advertisement
Ads by CJ

ఈ మధ్యన సినీ రచయితలు డైరెక్టర్స్ గా మారి సినిమాలు తీసేస్తూ తెగ హిట్స్ కొట్టేస్తున్నారు. రచయితలుగా అవమానులు భరించలేకే మేము డైరెక్టర్స్ గా మారుతున్నామని ఓపెన్ గా చెప్పేస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తున్నారు. ఆశ్చర్యం ఏముందిలే.. వారు ఎంతగా అవమానించబడక పొతే వీళ్ళు అలా మీడియా ముఖం గా అందరికి తెలిసేలా మాట్లాడుతున్నారా. ఆ మధ్య కొరటాల శివ ఈ అవమానాల కారణం గానే నేను డైరెక్టర్ ని అయ్యానని చెప్పాడు. అయితే ఈయనకి డైరెక్టర్ అవ్వాలని కోరిక పుట్టగానే ఎలాగోలా ప్రభాస్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. మరి కొరటాల తన టాలెంట్ తో ప్రభాస్ కి 'మిర్చి' తో హిట్ ఇచ్చాడు. ఆ హిట్ తోనే మహేష్ ని  అప్రోచ్ అవ్వగా మహేష్ కూడా కథ నచ్చడంతో ఆల్రెడీ హిట్ కొట్టి వున్నాడు గనక వెంటనే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని కొరటాల మళ్ళీ క్యాష్ చేసుకుని మహేష్ కి 'శ్రీమంతుడు' తో సూపర్ హిట్ ఇచ్చాడు. మరలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయం లో కూడా జరిగింది. రెండు హిట్స్ తో టాప్ డైరెక్టర్ అనిపించుకున్న కొరటాలకి ఎన్టీఆర్ కూడా వెంటనే అవకాశం ఇవ్వడమూ... కొరటాల 'జనతా గ్యారేజ్' తియ్యడమూ అది కాస్తా బ్లాక్ బస్టర్ అవ్వడమూ జరిగిపోయాయి. అందుకే కొరటాల తన అవమానాలను ఇప్పుడు బయటపెట్టాడు. 

అయితే ఇంకో రైటర్ వక్కంతం వంశీ కూడా డైరెక్టర్ అవ్వాలని తెగ ఎదురుచూస్తూన్నాడు. కానీ అతనికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఎన్టీఆర్ కోసం 'టెంపర్' స్టోరీ రాసి డైరెక్టర్ అవుదామనుకుంటే.... ఎన్టీఆర్ ఆ స్టోరీ తో పూరి డైరెక్షన్ లో 'టెంపర్' చేసాడు. అప్పుడే వంశీకి మాటిచ్చాడు మంచి స్టోరీ రాయి నువ్వే డైరెక్షర్ గా సినిమా చేద్దామని. కానీ 'టెంపర్' పూర్తయ్యే సరికి వంశీ స్టోరీ కంప్లీట్ అవ్వకపోవడం తో ఎన్టీఆర్ సుకుమార్ డైరెక్షన్ లో 'నాన్నకు ప్రేమతో' చేసేసాడు. పోనీ ఇప్పుడైనా చేద్దామనుకుంటే మళ్ళీ వంశీని పక్కన పెట్టి 'జనతా గ్యారేజ్' కొరటాల డైరెక్షన్ లో చేసాడు. పోనీ 'జనతా' తర్వాత అవకాశం ఇస్తాడని కాచుక్కూర్చున్న వంశీని మళ్ళీ ఎన్టీఆర్ దగా చేసాడు. పోనీలే అనుకున్న వంశీ మరో పవర్ ఫుల్ స్టోరీ రాసి అల్లు  అర్జున్ కి వినిపించగా అతను వంశీ తో ఓ సినిమా చెయ్యడానికి సిద్ధమయ్యాడు. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో 'డీజే' చేస్తుండగా..... దానితో పాటు  తాజాగా తమిళ డైరెక్టర్ లింగు స్వామితో మరో మూవీ కి కమిట్ అయ్యాడు. మరి వంశీ పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. పాపం వంశీ కి మాత్రం కాలం కలిసి రావడం లేదనే చెప్పాలి. 

అందుకే పాపం వంశీ ఏదన్న చిన్న హీరో ని నమ్ముకుంటే అయినా అతనికి డైరెక్టర్ గా ఛాన్స్ వస్తుందేమో. మరి అలా చిన్న హీరో తో సినిమా చేసి  డైరెక్టర్ అయితే  గనక చిన్న డైరెక్టర్ గా అయిపోయి మళ్ళీ పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం రావాలంటే చాలా కష్ట పడాలి. అందుకే వంశీ ఎలాగైనా ఒక పెద్ద హీరోతోనే సినిమా చెయ్యాలని అనుకుంటున్నట్లు తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ