Advertisementt

రానాకి మంచి లైన్ కుదిరింది..!

Thu 29th Sep 2016 02:12 PM
daggubati rana,ghaji,indo pak war,ghaji release date  రానాకి మంచి లైన్ కుదిరింది..!
రానాకి మంచి లైన్ కుదిరింది..!
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రంలో ప్రభాస్‌ కన్నా ఎక్కువ క్రెడిట్‌ కొట్టేసిన హీరో రానా అని చెప్పాలి. కాగా ఇప్పటికే ఆయన 'బాహుబలి' ది కన్‌క్లూజన్‌కు చెందిన షూటింగ్‌ కూడా ముగించాడు. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'ఘాజీ' చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా ప్రారంభించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌ వెర్షన్‌ని కరణ్‌జోహర్‌ నిర్మిస్తుండగా, తెలుగు, తమిళ భాషల్లో పివిపి సంస్ద నిర్మిస్తోంది. 1971లో ఇండోపాక్‌ వార్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ వాస్తవ గాధగాఈ చిత్రం రూపొందుతుండటం విశేషం. అయితే ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో గ్రాఫిక్స్‌తో పాటు ఇతర పనులు కూడా బాగా ఉండటంతో ఈ చిత్రాన్ని నింపాదిగా ఫిబ్రవరి 24న విడుదల చేయాలని నిర్ణయించారు. సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుండగా, 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. మొత్తానికి రానాకు ఈ రెండు చిత్రాలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ