'బాహుబలి'... ఇది ఓ ప్రత్యేక చిత్రం. ఈ చిత్రం దేశ విదేశాల్లో కూడా అంత కలెక్ట్ చేయడానికి కారణం దర్శకుడు రాజమౌళి మీద ఉన్న నమ్మకమే. అయితే 'బాహుబలి'తో తనకు దేశవిదేశాల్లో గుర్తింపు వచ్చిందని ఎవరైనా భావిస్తే అది తప్పు అనే చెప్పాలి. కాగా ప్రస్తుతం హీరో ప్రభాస్ తనకు మంచి బ్రేక్‌నిచ్చి ఈ స్ధాయికి ఎదగడం, ఈ చిత్రం విజయంలో కూడా తనది కీలకపాత్ర అని భావిస్తున్నాడట. ఇక ప్రభాస్ 'మిర్చి' తర్వాత తన మూడేళ్ల కాల్షీట్స్‌ను రాజమౌళి 'బాహుబలి'కే ఇచ్చేశాడు. కాగా నవంబర్‌లో 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత 'రన్ రాజా రన్' చిత్ర ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్‌కు మంచి సన్నిహితులైన ప్రమోద్, వంశీలు తమ యువి క్రియేషన్స్ బేనర్‌పై ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిన్నటి వరకు 60కోట్ల బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తీయాలని భావించినప్పటికీ ప్రభాస్ మాత్రం ఈ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో కూడా తీయాలని భావిస్తున్నాడట. దీని కోసం మరో 40కోట్లు బడ్జెట్‌ను పెంచి ఈ చిత్రం బడ్జెట్‌ను 100కోట్ల బడ్జెట్‌కు ప్రభాస్ తీసుకెళ్తున్నాడు. కానీ ప్రభాస్ రేంజ్ ఏమిటి? 'బాహుబలి' చిత్రం చూసి తాను 100కోట్ల హీరోగా ప్రభాస్ తనను తాను ఊహించుకోవడం తప్పని సినీ విశ్లేషకులు అంటున్నారు.