మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదని చెప్పాలి. 61ఏళ్ల వయసులోనూ ఆయన 20ఏళ్ల కుర్రాడిలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కాగా మెగాస్టార్ నటిస్తోన్న తమిళ 'కత్తి' రీమేక్‌ను 'ఖైదీనెం 150' చిత్రంలోని కొన్ని లుక్స్‌ను రామ్‌చరణ్ అధ్వర్యంలోని కొణిదెల బేనర్ విడుదల చేసింది. ఈ ఫొటోలలో చిరు నిజంగానే తన యంగ్‌లుక్‌తో అదరగొడుతున్నాడు. ఈ స్టిల్స్‌ను చూసి తెగ ఖుషీ అవుతోన్నమెగాభిమానులు ఇక సినిమాను ఎప్పుడెప్పుడు చూద్ధామని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జవనరిలో విడుదలకు సిద్దమవుతోంది. మొత్తానికి ఈ చిత్రంలోని స్టిల్స్‌ను చూసిన మెగాభిమానులు స్టైల్‌తో అదరగొడుతున్నావ్...బాసూ అంటున్నారు. మరి కొన్ని స్టిల్స్‌కే ఇంతగా రియాక్ట్ అవుతున్న మెగాఫ్యాన్స్ సంక్రాంతి కోసం కనులు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.