ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లాలోని కోట్ల వర్గీయులు ఇప్పటికే కొంతమంది తెదేపాలోకి కొంతమంది వైకాపాలోకి చేరిపోవడంతో కోట్ల డైలమాలో పడిపోయాడు. ముందుగానే తెదేపా యువనాయకుడు నారా లోకేష్ అప్పట్లో కోట్లను కలిసి మరీ తెదేపాలోకి ఆహ్వానించిన విషయం తెలిసిదే. అయితే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడుగా, మాజీ సీనియర్ ఎంపీగా, మంత్రిగా చేసిన తాను ఆలోచనలో పడి ఆ విషయాన్ని అలా హోల్డ్ లో పెట్టి వ్యవసాయం చేసుకుంటూ కర్నూలు జిల్లాకే పరిమితమయ్యాడు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించినప్పుడు ఆయన స్పందిస్తున్న తీరును చూస్తే గతమంతా మర్చిపోయి వైకాపాలోకి ఆయన మనస్సు మళ్ళినట్లుగా తెలుస్తుంది. అంతే కాకుండా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో జగన్ జరుపుతున్న పోరాటాన్ని మెచ్చుకున్న తీరును గమనిస్తే ఆ విషయం వెల్లడౌతుంది. అవసరమైతే తన ఎంపీల చేత రాజీనామా చేయించి అయినా ప్రత్యేక హాదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తానని జగన్ ప్రకటించడం ఆనందంగా ఉందంటూ కోట్ల తెలపడం చూస్తుంటే వైకాపా పై మనస్సు పారేసుకున్నట్లుగానే తెలుస్తుంది. కాగా ఇప్పుడు కోట్లను తెదేపా వాళ్ళు స్వయంగా ఆహ్వానించినా, వైకాపా దిశగా అడుగులు వేస్తున్నాడంటే ఇక వైకాపా ప్రవేశానికి సిద్ధమౌతున్నట్లుగానే తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోట్ల మొన్న రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు వ్యవహరించిన తీరుకు ఇంకా కోట్ల ఊగిపోతుండు. ఇక బయటకు రావడం తథ్యం అనే దిశగా డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు జగన్ బాగా ఫైట్ చేస్తున్నాడు అంటూ కోట్ల మురిసిపోయి వైకాపాలో చేరే దిశగా సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.