సూపర్ స్టార్ మహేష్ బాబు.. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో బిజీబిజీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. మురగదాస్ దర్శకత్వంలో అదీ స్టార్ హీరో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి దీనిపై అదిరిపోయే క్రేజీ రెస్పాన్స్ తో పాటు అభిమానుల్లో చెప్పలేని ఆతృత నెలకొంది.
కాగా వీరిద్దరి కాంబినేషన్లో తెరెకెక్కే ఈ సినిమాకు ఏం టైటిల్ పెడతారో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి జస్టిస్, న్యాయం కావాలి, చట్టంతో పోరాటం, ఎనిమి వంటి పలు రకాల టైటిల్స్ వినిపించాయి. చివరగా దసరాకు ఈ మూవీ కి సంబంధించి టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ.... టైటిల్ పేరే అభిమన్యుడు. చిత్ర యూనిట్ అంతా ఈ టైటిల్ నే ఖాయం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అన్యాయాలను ఎదుర్కొనేందుకు పోరాడిన ‘అభిమన్యుడు’ స్ఫూర్తి తో ఈ సినిమా ఆసాంతం ఉంటుందని, అందుకే ఈ టైటిల్ ను ఓకే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ‘అభిమన్యుడు’ లుక్ లో మహేష్ ఎలా కనిపించనున్నాడో చూద్దాం.