Advertisementt

పవన్‌ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది!

Wed 28th Sep 2016 05:32 PM
pawan kalyan,katamarayudu,veeram remake,ajith movie,pawan kalyan katamarayudu details  పవన్‌ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది!
పవన్‌ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది!
Advertisement
Ads by CJ

ఇంతకాలంగా పవన్‌కళ్యాణ్‌ నటించనున్న 'కాటమరాయుడు' విషయానికి వస్తే ఈ చిత్రం తమిళ చిత్రం 'వీరమ్‌'కు రీమేకా? కాదా? అనే విషయాలు అందరినీ అనుమానంలోకి నెట్టాయి. ఈ చిత్రం షూటింగ్‌ కోసం పవన్‌ పంచె కట్టు, ఆయన గెటప్‌ అన్ని 'వీరం' చిత్రంలోని అజిత్‌ గెటప్‌ను పోలివుండటంతో ఈ అనుమానాలు వచ్చాయి. కానీ తాజా సమచారం ప్రకారం ఈ చిత్రం 'వీరమ్‌'కు రీమేకేనని, అయితే తమిళంలోని చిత్రాన్ని పక్కాకు పక్కాగా తెరకెక్కించకుండా మూలకథను మాత్రమే తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా గతంలో వచ్చిన 'పెద్దరికం' కోవకు చెందిన చిత్రం ఇది. నలుగురు తమ్ముళ్లు, ఓ హీరోయిన్‌, మరదళ్లు ఇలా అన్ని పాత్రలను పెట్టుకోవడం చూస్తే ఇది 'వీరమ్‌' రీమేకేనని అర్దమవుతోంది. కాగా ఈ చిత్రంలో ఇప్పటి వరకు  పవన్‌ తమ్ముళ్లుగా 'పెళ్ళిచూపులు' ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ, కమల్‌ కామరాజును ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇద్దరు మరదళ్లుగా యామిని భాస్కర్‌, మానస లు ఇప్పటివరకు ఎంపికయ్యారు. కాగా ఇందులో పవన్‌ ఆడవారిని ద్వేషించే మిడిల్‌ ఏజ్‌డ్‌ హీరోగా కాస్త జుట్టు తెల్లబడి, ఓ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని మన నేటివిటీకి అనుగుణంగా తమిళ దర్శకుడు ఎస్‌.జె.సూర్యలతో పాటు డాలీ లు పలు మార్పులు చేర్పులు చేశారని సమాచారం. మొత్తానికి పవన్‌ సినిమా విషయంలో 'వీరమ్‌'కు ఇది రీమేక్‌ అనే వార్త ఇప్పుడు స్పష్టంగా అర్ధమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ