కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ తనయుడిని అనే అహంకారంతో రామ్‌చరణ్ పలు సందర్భాలలో అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ఉడుకు రక్తంతో మీడియాపై నోరు పారేసుకోవడం, మరో సందర్భంగా కారుకి అడ్డం వచ్చారన్న సాకుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై దాడి చేయడం, ఇలా పలు సందర్భాలలో రామ్‌చరణ్‌పై చెడ్డ ముద్ర పడింది. కానీ వయసు వచ్చే కొద్ది అందుకు తగ్గట్లుగా హుందాగా ఉండటం ఇప్పుడిప్పుడే ఆయన అలవాటు చేసుకుంటున్నాడు. హుద్‌హుద్ తుపాన్ సమయంలో అందరికి కంటే మొదటగా స్పందించింది రామచరణే కావడం విశేషం. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో వానలు ముంచెత్తుతున్న వేళ వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న దేవధర్ అనాధ ఆశ్రమ పిల్లలకు ఆయన సాయం అందిస్తున్నాడు. కాగా అక్టోబర్15న ఉగ్రవాదుల చేతిలో మరణించిన బాధిత కుటుంబాల కోసం ఓ ఛారిటీ సంస్ద అమెరికాలో నిర్వహించే లైవ్‌షోలో ఆయన ఉచితంగా ప్రదర్శన ఇవ్వనున్నాడు. మొత్తానికి ఈమధ్య చరణ్ వ్యక్తిగతంగా చాలా మారాడు.. అని ఆయన సన్నిహితులు కూడా ఒప్పుకుంటున్నారు.