ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రంగా వినాయక్ దర్శకత్వంలో తమిళ 'కత్తి' రీమేక్‌గా 'ఖైదీ నెం150' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం తమిళ మాతృకలో హీరో విజయ్ ఓ పోలీస్‌స్టేషన్ సీన్‌లో కేవలం ఓ డ్రాయర్‌తో కనిపిస్తాడు. కథ రీత్యా అవసరం కావడం, అందుకు అనుగుణంగా నేచురాలిటీ కోసం విజయ్ ఆ సీన్‌ని రక్తి కట్టించాడు. కానీ ఇప్పుడు చిరు చేస్తున్న తెలుగురీమేక్‌లో అలాంటి సీన్ ఉండదని, 'ఠాగూర్' క్లైమాక్స్‌ను మార్చినట్లే వినాయక్ ఈ సీన్‌ను కూడా మెగాస్టార్‌కు ఇబ్బంది రాకుండా తీయనున్నాడని సమాచారం. మెత్తానికి ఈ తెలుగు రీమేక్‌లో పలు మార్పులు చేర్పులు చేసి, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా సన్నివేశాలను వినాయక్ తీర్చిదిద్దుతున్నాడట. సహజత్వానికి తగ్గట్లుగా చిరు కోసం ఈ చిత్రంలో చేస్తున్న మార్పులు చేర్పులు ఎక్కువగా వున్నాయంట. మరి ఇలా చేయడం వల్ల ఈ చిత్రం తమిళంలో కంటే బాగా మాస్ ప్రేక్షకులను అలరిస్తుందా? లేక ఆత్మలేని శరీరంగా మారుతుందా? అనేది చిత్రం విడుదలైతే మాత్రమే తెలుస్తుంది.