రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఎప్పుడు పడితే అప్పుడు ప్రచారం జరిగింది. మరి అయన ఫాలోయింగ్ ని చూసి అందరూ ఆయన రాజకీయాల్లోకి వస్తే రికార్డులు బద్దలవుతాయని భావించి రాజకీయాల్లోకి లాగాలని చాలామంది చూసారు. కానీ రజినీ మాత్రం ఇప్పుడు కాదు... చూద్దాం అంటూ సమాధానం దాటవేస్తూ వచ్చారు. అయితే రజినీకి కూడా ఎదో ఒక మూలన రాజకీయాల్లోకి రావాలని ఉండేదని... కానీ రాజకీయాల్ని హ్యాండిల్ చెయ్యడం అంత సులువైన పని కాదని అందుకే ఆయన వాటికి దూరం గా ఉంటూ వస్తున్నారనే ప్రచారము వుంది. ఆయనతో పలు రాజకీయ పార్టీలు చర్చలు జరిపి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానాలు కూడా పంపారు,. కానీ రజిని మాత్రం వాటికి జవాబివ్వకుండా కన్ఫ్యూజన్ లోనే ఉండేవాడు. వుంచేవాడు. కానీ రాజకీయాల్లోకి రానని తెగేసి ఎక్కడా ఆయన మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు రజినీ రాజకీయ రంగ ప్రవేశం కంపల్సరీ వుంటుందనే వార్తలు నిత్యం వస్తూనే ఉండేవి. మొన్నటికి మొన్న మోడీ ఆయన్ని బిజెపిలోకి లాగాలని ప్రయత్నించారు. కానీ రజినీ మాత్రం తర్వాత అంటూ దాట వేశాడు.
అయితే ఇప్పుడు అందరికి షాక్ ఇచ్చేలా రజినీకాంత్ రాజకీయాల్లోకి రారని చెబుతున్నారు. అదేమిటి ఆయనేమైనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారా మేం చూడలేదు అనుకుంటున్నారేమో. కాదులెండి రజినీ డైరెక్ట్ గా ఈ విషయం చెప్పలేదుగాని అయన తమ్ముడు సత్యన్నారాయణ రజినీ రాజకీయ రంగప్రవేశం గురించి కొన్ని వ్యాఖ్యలు మీడియా ముందు చేసాడు. అవేమిటంటే... రజినీ గారు ఎప్పటికి రాజకీయాల్లోకి రారని తెగేసి చెప్పాడు. అసలు రాజకీయాలపై రజినీకి పెద్ద ఆసక్తి లేదని ఆయన తమ్ముడు చెబుతున్నాడు. అయితే ఫాన్స్ ని నిరాశ పడొద్దని అలాగే రాజకీయ పార్టీలు కూడా నిరాశ పడొద్దని చెబుతున్నారు. ఎందుకంటే రజినీ ఈ విషయాలేమి మాట్లాడలేదు కదా... కేవలం ఆయన తమ్ముడి వ్యాఖ్యలే కదా అంటున్నారు. అసలు రాజకీయాల గురించి రజినీ మాట్లాడితేనే బావుంటుంది.