జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకొని ఏ సినిమా తీసేప్పుడైనా ఆ జీవితంతో ముడిపడిన వ్యక్తులకు కాస్త టెంక్షన్ గానే ఉంటుంది. అది సహజం. వాస్తవ చిత్రణ కోసం సజీవంగా ఉన్న జీవిత చరిత్రలు తెరకెక్కించేప్పుడు ఇలాంటి అత్యంతాసక్తిని ఆయా వ్యక్తులు కనపరచడం సహజమే. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న చిత్రం ఎంఎస్ ధోని. జీవితకథను ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా బృందంతో పాటు ధోనీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే విడుదలకానున్న ఈ సినిమా కోసం అభిమానులే కాకుండా ధోనీ జీవితంతో ముడిపడి ఉన్న కొంతమంది వ్యక్తుల ఆందోళన నెలకొని ఉంది. తమ గురుంచి సినిమాలో ఎలా చూపిస్తారో, ఏ కోణాన్ని టచ్ చేస్తారోనని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆ దిశగా ఎంఎస్ ధోని కథను తెలుసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తుంది హీరోయిన్ లక్ష్మీ రాయ్. ఎంఎస్ ధోనీ చిత్రంలో లక్ష్మీరాయ్ పాత్ర ఉంటుందా అనే అంశంపై అంతటా చర్చలు సాగుతున్నాయి. ఒకప్పుడు అంటే 2008లో ధోనీతో లక్ష్మీరాయ్ చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రకంగా లక్ష్మీరాయ్ ప్రస్తుతం తత్తరపాటుకు లోనౌతుంది.
ఈ విషయంపై ఇప్పుడు లక్ష్మీరాయ్ స్పందిస్తూ.. ఎంఎస్ ధోనీ సినిమాలో తన పాత్ర ఉంటుందని తాను భావించడం లేదని, ఎప్పుడో ఏదో జరిగిన విషయం గురించి మళ్ళీ చర్చలకు దారితీయడం దురదృష్టకరం అంటూ లక్ష్మీరాయ్ వెల్లడించింది. తన గురించి ఎందుకు చర్చించుకుంటున్నారో తనకు అర్ధం కావటం లేదంటుంది లక్ష్మీరాయ్. తాను 2008 వ సంవత్సరం ఐపీఎల్ కి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మాట వాస్తవమే. అప్పుడే తనకు ధోనీతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం మాకు పెళ్ళిదాకా రాలేదు. ఆ సంవత్సరం ఐపీఎల్ అయిన తర్వాత చెన్నై టీంతో తన అనుబంధం తీరింది. అంతేకానీ... అక్కడ ఏం జరగలేదు. ఆ తర్వాత ధోనితో తాను టచ్ లో లేను అంటుంది లక్ష్మీరాయ్. కానీ ప్రస్తుతం తన గురించి అంతా చర్చించుకోవడంతో తాను అసలేం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఎంఎస్ ధోనీ చిత్ర కథ గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమేనంటుంది లక్ష్మీరాయ్. కానీ ఆ సినిమాకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం తెలియలేదు అన్నది లక్ష్మీరాయ్.
కాగా ప్రస్తుతం ఎంఎస్ ధోనీ జీవితకథపై వచ్చే ఈ సినిమాపై ధోని గార్ల్ ఫ్రెండ్స్ ప్రస్తావన ఉంటుందా లేదా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ధోనీకి గతంలో ప్రియాంక ఝా అనే ఒక స్నేహితురాలు ఉండేది కానీ ఆమె ఒక ప్రమాదంలో మరణించింది. కానీ ప్రస్తుతం అంతా ఎంఎస్ ధోనీ చిత్రంలో ప్రియాంక ఝాతో పాటు లక్ష్మీరాయ్ అంశం కూడా ఉంటుందన్నది పరిశ్రమలో హాట్ టాపిక్ లా మారి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఉంటే ఆ పాత్రలను ఎలా చిత్రీకరించారు అన్నది కూడా హాట్ టాపిక్ అయింది. ఇది అలా ఉంచితే 2010లో ఎంఎస్ ధోనీ.. సాక్షి రావత్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంఎస్ ధోనీ చిత్ర కథ ఏయే కోణాలను ఆశ్రయించుకొని నడిచిందో తెలుసుకొనేందుకు పరిశ్రమ అంతా ఆసక్తి కనబరుస్తుంది.