కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ లో రాబోవు సాధారణ ఎన్నికల కోసం అన్ని పార్టీలకంటే ముందుగానే రాహుల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సీతాపూర్ లో రోడ్ షో నిర్వహించాడు. రాహుల్ రోడ్ షో నిర్వహిస్తుండగా ఓ స్థానిక యువకుడు రాహుల్ గాందీపై బూటు విసిరాడు. అయితే చాలా మెలకువగా వ్యవహరించిన రాహుల్ ఆ దెబ్బ తగలకుండా తప్పించుకున్నాడు. కాబట్టి బూటు తగల్లేదు. కాగా అక్కడ ఉన్న కార్యకర్తలు ఆ బూటు విసిరిన వ్యక్తిని గుర్తించడంతో అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీస్ లు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై రాహుల్ గాంధీ స్పందించాడు. తను ఇటువంటి దాడులకు ఏమాత్రం వెరవనని వివరించాడు. ఈ సందర్భంగా భాజపా, ఆర్ ఎస్ ఎస్ లకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నానంటూ.. నాపై మీరు చెప్పులు వేయదలచుకుంటే వేయండి, కానీ వీటికి కించిత్తు కూడా భయపడనని వెల్లడించాడు. ఈ సందర్భంగా భాజపా, ఆర్ ఎస్ ఎస్ లపై రాహుల్ తీవ్రంగా స్పందించాడు.