Advertisementt

అభినేత్రి లాంటి సినిమా ఇంక చేయదంట!

Tue 27th Sep 2016 01:45 PM
abhinetri movie,tamanna,tamanna about abhinetri movie,tamanna bhatia  అభినేత్రి లాంటి సినిమా ఇంక చేయదంట!
అభినేత్రి లాంటి సినిమా ఇంక చేయదంట!
Advertisement
Ads by CJ

తమన్నా కెరీర్లోనే మొట్టమొదటి సారిగా అభినేత్రి వంటి త్రిభాషా చిత్రంలో నటించింది మిల్కీ బ్యూటి. అందుకు చాలా కష్టాలు అనుభవిస్తుంది పాపం తమన్నా. తమన్నా అభినేత్రి అనే త్రిభాషా (తమిళ, హిందీ, తెలుగు) చిత్రంలో నటించేందుకు చాలా చాలా కష్టపడిందట. 'అనుకోకుండా అభినేత్రి వంటి త్రిభాషా చిత్రంలో  నటించాల్సి వచ్చింది. ఇటువంటి త్రిభాషా చిత్రాలను ఇంక ఎప్పుడూ ఒప్పుకొని చేయను' అని చెబుతుందీ భామ. తమన్నా మాట్లాడుతూ మూడు భాషల్లో తీసే చిత్రాల్లో నటించడం చాలా కష్టంతో కూడుకున్న విషయంగా ఆ సినిమాలో నటించిన  తర్వాత తెలిసింది. మూడు బాషల్లోనూ ఆ పాత్రకు అనుగుణంగా  పాాత్ర తీరుతెన్నులకు తగిన విధంగా నటించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అంటుంది తమన్నా. 

కాగా 'అభినేత్రి' సినిమా  త్రిభాషా చిత్రమైనా 58రోజుల్లోనే  పూర్తి అయింది. అంటే ఏ లెవల్లో కష్టపడాల్సి వచ్చిందో ఒక్కసారి అర్ధం చేసుకోండి అంటూ వెల్లడించింది తమన్నా. ముందు షూటింగ్ ప్రారంభ దశలో తమిళం, హిందీ అనే అనుకున్నారు చిత్ర బృందం. తర్వాత తెలుగును కూడా యాడ్ చేశారు. దాంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఇక ముందు త్రిభాషా వంటి సినిమాల జోలికి వెళ్లదలచుకోలేదని తమన్నా వివరించింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ