Advertisementt

రకుల్.. రాశీ ఖన్నాలు హైదరాబాదీలే..!

Mon 26th Sep 2016 11:52 PM
rakul preet singh,raashi khanna,raashi khanna have own house in hyderabad,telangana,raashi khanna office,rashi khanna business offers  రకుల్.. రాశీ ఖన్నాలు హైదరాబాదీలే..!
రకుల్.. రాశీ ఖన్నాలు హైదరాబాదీలే..!
Advertisement
Ads by CJ

వ్యాపారాల కోసం హైదరాబాద్ వచ్చే చాలా మంది ఎక్కువగా హోటల్స్ కే పరిమితమౌతుంటారు. కానీ సినిమానే బిజినెస్ గా ఎంచుకొన్న వాాళ్ళు మాత్రం, అందులో కలిసొచ్చే ప్రాంతంలో ఆయా వ్యక్తులు సొంత ఇళ్లను కొనుక్కోవడమో, స్వయంగా ఏర్పాటు చేయించుకోవడమో చేస్తుంటారు. కొంతమంది హీరోయిన్లు అయితే అంటే తెలుగులో ఎప్పటి నుంచో ఉండి ఎక్కువగా సినిమాలు చేసిన తమన్నా, అనుష్క వంటి వారికైతే ఇప్పటికీ హైదరాబాద్ లో సొంత ఇళ్లు లేవు. అప్పట్లో ఇలియానా హైదరాబాద్ లో ఇళ్లు కొనుక్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ భామ బాలీవుడ్ బాట పట్టడంతో ఇక్కడి ఇళ్లు అమ్మి అక్కడ కొనుక్కున్నది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నాలు ఇద్దరూ హైదరాబాద్ లో ఇళ్లను కొనుక్కున్నారు. రాశీఖన్నా ఇల్లు తీసుకోవడమే కాకుండా కుటుంబాన్నంతా హైదరాబాద్ మార్చేసింది. రాశీఖన్నా హైదరాబాదీల సరసన ఎంతలా ఒదిగిపోయిందంటే తనకు ఎప్పుడు మీడియాతో ముచ్చటించే అవకాశం వచ్చినా తాను హైదరాబాదీనే అంటూ చెప్పుకుంటుంది ఈ బొద్దుగుమ్మ. రాశీఖన్నా ఇల్లు కొనుగోలు చేయడమే కాదంట. ఈ మధ్య ఓ ఆఫీసును కూడా తీసుకున్నదని టాక్. ఓ హీరో ఆఫీసును తను కొనుక్కున్నదని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. దర్శక నిర్మాతలకు కదా ఆఫీసులు కావాల్సింది, హీరోయిన్ కు ఎందుకు అనుకుంటున్నారా.. అనుమానంతో ఆ విషయాన్ని అడిగితే రాశీ మాత్రం తాను ఓ బిజినెస్ కోసం అది తీసుకున్నట్లు చెప్పుకొస్తుంది. మొత్తానికి రాశీ ఖన్నా కూడా బిజినెస్ పనిలో ఉందన్నమాట.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ