Advertisementt

ఐటెం పై తమన్నా తెలివైన సమాధానం!

Mon 26th Sep 2016 11:34 PM
tamanna,item song,tamanna bhatia,tamanna about item songs,jaguar,heroines,item songs  ఐటెం పై తమన్నా తెలివైన సమాధానం!
ఐటెం పై తమన్నా తెలివైన సమాధానం!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేసే హీరోయిన్స్ హవా నడుస్తుంది. ఇదివరకట్లో అయితే ఐటెం సాంగ్ చెయ్యడానికి కొంత మంది వేరే తారలు ప్రత్యేకంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఒక సినిమాలో ఐటెం కోసం టాప్ పొజిషన్ లో వున్న హీరోయిన్స్ ని సంప్రదించడము.... వారికి భారీ రెమ్యునరేషన్ ఆశ చూపెట్టి వాళ్ళని ఒప్పించి ఐటెం సాంగ్స్ చేపిస్తున్నారు. మరి రెమ్యునరేషన్ కి ఆశపడి వారు కూడా ఐటెం సాంగ్స్ కి సై అంటున్నారు. అసలు ఈ ట్రెండ్ కి శృతి, తమన్నాలు తెర తీసారని  చెప్పాలి. ఎలా అంటే తమన్నాని బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్ చేసే సినిమాలో ఐటెం సాంగ్ కి సంప్రదించగా ఆమె మొదట నో చెప్పిందట. కానీ ఎక్కువ మొత్తం లో ముట్టచెబుతామని చెప్పగానే ఓకె చేసిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇక మళ్ళీ శ్రీనివాస్ తన రెండో సినిమాకి కూడా తమన్నాతోనే ఐటెం చేయించాలని పట్టుబట్టి ఆమెతోనే చేయించాడు. ఇక 'ఆగడు' సినిమాలో శృతిహాసన్ కూడా ఐటెం తో అదరగొట్టింది. మళ్ళీ ఇన్నాళ్లకు కాజల్ తాజాగా 'జనతా గ్యారేజ్' లో ఐటెం సాంగ్ చేసి మతులు పోగొట్టిన విషయం తెలిసిందే. మళ్ళీ తమన్నా చేతి నిండా సినిమాలతో బిజీ గా వున్నా కూడా నిఖిల్ కుమార్ హీరో గా పరిచయమయ్యే 'జాగ్వార్' చిత్రం లో ఐటెం సాంగ్ చేసి ఔరా అనిపించింది. అయితే తమన్నా మాత్రం నేను ఐటమ్స్ చేయ్యనని చెప్పను.... అలా అని ఐటమ్స్ చేస్తూ ఉండిపోను. అసలు నా డాన్సుని  ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే నేను ఓ మంచి పాటకు అవకాశం వస్తే తప్పకుండా ఐటెం సాంగ్స్ చేస్తానని ఓపెన్ అయిపొయింది. అంతేనా లేక ఒక్క సినిమాలో నటించే రెమ్యునరేషన్ కన్నా ఒక్క ఐటెం సాంగ్ కే ఎక్కువ మొత్తం అందుకోవచ్చనా. ఏదైనా తమన్నా చాలా తెలివిగా సమాధానమిచ్చింది కదూ!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ