Advertisementt

పవన్ కోసం కొరటాల లైన్ లోకి..!

Mon 26th Sep 2016 06:43 PM
koratala siva,pawan kalyan,10 scripts,koratala movie with pawan kalyan  పవన్ కోసం కొరటాల లైన్ లోకి..!
పవన్ కోసం కొరటాల లైన్ లోకి..!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటేనే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఆయనతో సినిమా చేసే అవకాశం గానీ, తీసే అవకాశం గానీ, అందులో నటించే అవకాశంగానీ వస్తే అస్సలు ఆలోచించరు. టకీమ్మని ఓకే చెప్పేస్తారు. అందులో సందేహం లేదు. ఇప్పుడు కొరటాల.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఓ కథను సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలలో చెప్పినట్లుగా కొరటాల వద్ద ఇంకా పది కథలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అస్సలు కొరటాల అంటేనే గొప్ప సోషల్ ఎలిమెంట్ తో పాయింట్  ఉండేలా ఇప్పటివరకు తాను తీసిన సినిమాలతో ప్రూవ్ చేసి చూపించారు. ఆయన ఏ సినిమా తీసినా అందులో సామాజిక పరమైన అంశం అలా అళ్లుకొని ఉంటుంది. అలా తీగలా సాగిపోతుంది. అదే ఆయన సినిమాలను బ్రతికిస్తుంది. బాక్సాపీస్ ను బద్ధలు చేస్తుంది. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల వద్ద ఉన్న కథలలో ఓ కథ పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలిగేది ఉందట. అందుకని కొరటాల పవన్ కోసం ఆ కథను జాబితాలో నుండి తీసి పూర్తి స్థాయి స్క్రిప్టును  సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. కథ మొత్తం ఓ కొలిక్కి వచ్చాక వెళ్ళి పవన్ కళ్యాన్ కు వినిపించి ఆ తర్వాత ఆయనతో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల నుండి సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్, కొరటాల కాంబినేషన్ కోసం ప్రేక్షకులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. అస్సలు ఏదో ఒక సోషల్ ఎలిమెంటుతో గానీ పవన్ తో సినిమా చేస్తే ఇక వీరిద్దరి రేంజ్ ఏ స్థాయికి వెళ్తుందో  చెప్పక్కరలేదు. ఇప్పటికే కొరటాల మహేష్ కోసం స్క్రిప్టు రెడీ చేసి ఉంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం పవన్ కి తగిన స్క్రిప్టు రూపకల్పనలో కొరటాల తలమునకలైపోయినట్లు తెలుస్తుంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ