బాలీవుడ్ లో ఏ హీరోయిన్ అయినా ఏదైనా ఒక ఫంక్షన్ కి హాజరైతే ఆ హీరోయిన్ డ్రెస్ ఎలా ఉంటుంది... ఆమె ఏం జ్యుయలరీ వేసుకుంది అని జనాలు తెగ మాట్లాడేసుకుంటారు. అసలు ఈవెంట్ కన్నా వీళ్ళు ఏం ధరించారో అన్న దానిపైనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. అయినా బాలీవుడ్ స్టైల్ వేరుగా ఉంటుందని.... అక్కడ ఏ హీరోయిన్ అయినా కూడా డ్రెస్ విషయం లో చాలా శ్రద్ద తీసుకుని మరీ డిజైన్ చేయించుకుంటుంది. అందుకే వారు వేసుకునే డ్రెస్సులు గురించి అంత చర్చ జరుగుతుంది. ఆ డ్రెస్ లో వారి అందాలను ఆరబోస్తూ తెగ హాట్ లుక్ తో కనిపించడానికి ట్రై చేస్తూ వుంటారు. ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్ భామలు కూడా బాలీవుడ్ భామలకు తీసిపోకుండా డ్రెస్ సెన్స్ చూపిస్తున్నారు. ఆ మధ్యన కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కి వేసుకున్న డ్రెస్ చూసిన వాళ్ళు అటు బాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే సౌత్ భామలు కూడా చాలా స్పైసి యాంగిల్స్ లో తమ అందాలను ఆరా బోస్తున్నారుగా అని అన్నారు.
అసలు ఈ సోదంతా ఎందుకంటే ఇక్కడ సౌత్ భామలైన సమంత, తమన్నా, శృతి హాసన్, కాజల్, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా లు కూడా బాలీవుడ్ స్టయిల్ లోకి మారిపోయి తమ అందాలను చూపించడానికి రెడీ అయిపోయారు. ఏదన్న ఒక ఈవెంట్ జరుగుతుంది అంటే అక్కడ ఈ భామలు తమ డ్రెస్ లతో చూపరుల మతులు పోగొట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న 'ప్రేమమ్' ఆడియో వేడుకలో శృతి హాసన్ వేసుకున్న డ్రెస్, ఆమె అందాలు క్లివేజ్ షో తో అందరిని పడగొట్టేసింది. అది మరవకముందే రాశి ఖన్నా 'హైపర్' ఆడియో వేడుకలో దిమ్మ తిరిగే అందాలతో పిచ్చెక్కించింది. ఇక ఇప్పుడు తమన్నా, రకుల్ కూడా తాజాగా జరిగిన 'అభినేత్రి' ఆడియో వేడుకకి వేసుకున్న డ్రెస్ లు చూస్తే వాళ్ళ అందాలను అలా చూస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిపోవాల్సిందే అంటున్నారు జనాలు. మరి మన సౌత్ భామలు...బాలీవుడ్ భామలను తల దన్నే రీతిలో కనిపిస్తూ వారి కంటే మేమేం తక్కువ కాదు అనిపించుకునే పనిలో పడ్డారా..అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే..!!