Advertisementt

స్టైలిష్ స్టార్.. స్టైల్ మార్చుతున్నాడు..!

Mon 26th Sep 2016 05:54 PM
allu arjun,dj,duvvada jagannadham,linguswami direction,remuneration,nizam rights  స్టైలిష్ స్టార్.. స్టైల్ మార్చుతున్నాడు..!
స్టైలిష్ స్టార్.. స్టైల్ మార్చుతున్నాడు..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 40 నుండి 50 కోట్ల లోపే పూర్తి చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఇక  చిత్ర పూజా కార్యక్రమాలు గత వారం  పూర్తయిన విషయం తెలిసిందే. అయితే  సినిమాని కొంచెం టైం తీసుకుని పట్టాలెక్కించాలని చూస్తున్నారట. బన్నీ ఇప్పటికే 3 సినిమాల హ్యాట్రిక్ హిట్ తో యమా స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. మరి ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీగా రెమ్యునరేషన్ వసూలు చేస్తాడనే గాసిప్స్ మొదలయ్యాయి. ఇప్పటికే బన్నీ.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'డీజే దువ్వాడ జగన్నాథం' లో చేస్తున్నాడు. మరి లింగుస్వామి డైరెక్షన్ లో చేసే సినిమాకి అల్లు అర్జున్ గట్టిగా వసూలు చేయనున్నాడని సమాచారం. అయితే బన్నీ మాత్రం ఈ సినిమాకి రెమ్యునరేషన్ కి బదులు నైజాం రైట్స్ తీసుకుంటున్నాడని అంటున్నారు. అప్పుడే ఈ వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం బన్నీ రెమ్యునరేషన్ మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కాక రెమ్యునరేషన్ గురించి చర్చిద్దామని మేకర్స్ అల్లు అర్జున్ తో చెప్పినట్లు కోలీవుడ్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ