Advertisementt

వారి పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చినట్లేగా...!

Mon 26th Sep 2016 05:38 PM
samantha,naga chitanya,engagement,nagarjuna,marriage,enagagement pics,marriage post pone  వారి పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చినట్లేగా...!
వారి పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చినట్లేగా...!
Advertisement
Ads by CJ

సమంత - నాగ చైతన్య ప్రేమలో ఉన్నారో.. అని మీడియా తెగ గోల, గోల చేసేసింది. ప్రేమ పక్షుల్లా వారు ఎక్కడపడితే అక్కడ మీడియా కి దొరకడమూ... వీరి లవ్ స్టోరీ మాట్లాడితే తెర పైకి రావడమూ... ఎప్పటినుండో జరుగుతుంది. అసలు ఆఫీషియల్ గా ఎక్కడా నాగ చైతన్య గాని సమంత గాని మేము పెళ్లి చేసుకోబోతున్నామనే మాట చెప్పలేదు. ఇండైరెక్టుగా క్లూలు ఇవ్వడం తప్పితే ఎక్కడా ఆఫీషియల్ అనౌన్సమెంట్ లేదు. కాకపోతే నాగార్జున మాత్రం నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి పెళ్ళిలో  నాగ చైతన్య కు కాబోయే భార్యగా.... అక్కినేని కోడలిగా సమంతని అందరికి పరిచయం చెయ్యడం కూడా మీడియా చెబితే అందరికి తెలిసింది. కానీ తన కొడుకు ప్రేమలో వున్నాడని పెళ్ళికి మాత్రం కొంచెం టైం కావాలన్నాడని... అందుకే ముందుగా తన చిన్న కొడుకు అఖిల్ ప్రేమను అంగీకరించి అతనికి ఎంగేజ్మెంట్ చేస్తున్నానని మీడియా ముఖం గా తెలియ చేసాడు. ఇక నాగ చైతన్య పెళ్ళి మాత్రం వచ్చే వేసవి వరకు పోస్ట్ పోన్ అయినట్లు వార్తలొచ్చాయి. పెళ్ళైతే పోస్ట్ పోన్ అయ్యింది గాని... ఎంగేజ్మెంట్ ఎప్పుడనేది మాత్రం అటు నాగ్ గాని ఇటు చైతు - సమంతలు గాని బయటపెట్టలేదు. అయితే వీటన్నిటికీ తెరదించుతూ చైతు - సమంత ఎంగేజ్మెంట్ అయిపోయినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ లీక్ అయ్యాయి. ఇంకేముంది అన్ని రూమర్స్ కి చెక్ పెడుతూ వీరు ఎంగేజ్మెంట్ చేసుకుని అందరిని ఆశర్యం లో ముంచేశారు. ఈ ఎంగేజ్మెంట్ ని నాగార్జున దగ్గరుండి జరిపించినట్లు ఈ ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఇప్పటికైనా నాగ చైతన్య - సమంతల ప్రేమ పెళ్లి విషయం లో మీడియా కొంచెం తగ్గి వ్యవహరిస్తుందని నాగార్జున ఇలా ఎంగేజ్మెంట్ చేసిపారేశాడని అందరూ చెప్పుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ