ఒకప్పుడు దర్శకునిగా మారి మెగాఫోన్ పట్టాలంటే ఏళ్లకు ఏళ్లు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్లుగా పనిచేసి మెగాఫోన్ చేతపట్టే సమయానికి నాలుగైదు పదుల వయసు మీదకు వచ్చేది. కాగా ఇటీవల దర్శకులుగా మారుతున్న వారి వయసు చూస్తే 20 ఏళ్ల నుంచి 40లోపలే అవకాశాలు పట్టేస్తున్నారు. విరించి వర్మ,సుజీత్, మేర్లపాక గాంధీ, సుధీర్‌వర్మ, కొండా విజయకుమార్, చందు మొండేటి, అనిల్ రావిపూడి, అవసరాల శ్రీనివాస్, హను రాఘవపూడి, సంపత్ నంది, కళ్యాణ్ కృష్ణ వంటి వారంతా యంగ్ దర్శకులే. పూరీ, రాజమౌళి, త్రివిక్రమ్, వినాయక్ వంటి వారిని పక్కనపెడితే ఈ దర్శకులందరూ 35 సంవత్సరాల లోపలే దర్శకులైపోయి తమదైన ముద్రను వేస్తున్నారు. అతి చిన్న వయసులోనే దర్శకులుగా రచ్చరచ్చ చేసేస్తూ సీనియర్లకు కూడా సవాల్‌గా మారుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజ్యమేలుతున్న యువదర్శకులంతా ఉడుకురక్తంతో తమదైన శైలిని ప్రదర్శిస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.