Advertisementt

పవన్‌ ఈసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు!

Mon 26th Sep 2016 03:16 PM
pawan kalyan,manasa,manasa hithavarsha,pawan kalyan with manasa,manasa in katamarayudu  పవన్‌ ఈసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు!
పవన్‌ ఈసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించాలని హీరోయిన్లే కాదు..... క్యారెక్టర్‌ ఆర్టిస్‌లతో పాటు అందరూ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరికైనా కొత్తవారికి ఆ అవకాశం వచ్చిందంటే ఎగిరిగంతేస్తారు. కాగా ప్రస్తుతం పవన్‌ హీరోగా డాలి దర్శకత్వంలో రూపొందుతున్న 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌ ఈమధ్యే ప్రారంభమైంది. కాగా ఈ చిత్రంలో పవన్‌కు మరదలు పాత్ర ఊహించకుండా ఓ ఆర్టిస్ట్ కు వచ్చింది. మోడల్‌గా, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టుగా, డ్యాన్సర్‌గా మంచి ప్రతిభ కలిగిన నటి మానస హితవర్ష. కాగా కాటమరాయుడు చిత్రంలో ఆమె లంగా,ఓణి, జాకెట్‌ వేసుకొని కొంటే వేషాల్లో నటించే పవన్‌కు కొంటె మరదలిగా నటించనుందట. ఈమె ఇంతకు ముందు 'రొమన్స్‌' చిత్రంలో కూడా నటించింది. కాగా ఇప్పుడు ఆమె టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయింది. తాను పవన్‌కు చిలిపి అల్లరి మరదలిగా నటిస్తున్నానని, ఆయనతో ఎప్పుడు షూటింగ్‌ మొదలవుతుందా? అని వేయ్యి కళ్లతో వేచిచూస్తున్నానని ఆమె అంటోంది. మొత్తం మీద ఈ చిత్రంలో ఆమెకు అవకాశం రావడం ఒక విధమైన అదృష్టమేనని అందరూ ఒప్పుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ