అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథ ని తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ ఇప్పటికే 'ఎవడే సుబ్రహ్మణ్యం' తో దర్శకుడిగా అందరిని మెప్పించాడు. అయితే సావిత్రి పాత్రకి ముందుగా విద్యాబాలన్ ని అనుకున్నారని వార్తలొచ్చాయి. తర్వాత ఆ ప్లేస్ లోకి నిత్యమీనన్ వచ్చి చేరింది. నిత్య అయితే సావిత్రి పాత్రకు న్యాయం చేయగలదని ఆమెని తీసుకుంటున్నారని అన్నారు. అనడమేమిటి నిత్య మహానటి సావిత్రి సినిమాలో చేస్తుందని.... మరి సినిమా విషయం లో కొంచెం కూడా కేర్లెస్ నెస్ ని సహించని అశ్వినీదత్ నిత్యని పిలిచి ఆమెకు చిన్నపాటి క్లాస్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతోంది. అదేమిటంటే నాగ చైతన్య, ఎన్టీఆర్ ఈ సావిత్రి జీవత కథలో నటించబోతున్నారని వార్త. మరి సావిత్రి సినీ జీవితంలో ఏయన్నార్, ఎన్టీఆర్ ఇద్దరు ముఖ్యమైన పాత్రలు పోషించారు. అందుకే ఈ మహానటి సావిత్రి సినిమాలో అటు అక్కినేని వారసుడు.... ఇటు నందమూరి వారసుడితో నటింపచేయాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నాడని సమాచారం. అయితే వీరిద్దని నాగ్ అశ్విన్ సంప్రదించినట్టు వార్తలు కూడా వచ్చాయి. దీనిలో నిజమెంతో తెలీదుకానీ.... ఈ వార్త ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది . మరి వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని నందమూరి అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి వీరుగనక కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఫాన్స్ కి పండగే పండగ.