Advertisementt

ఇక గన్ను పట్టాల్సిందేనన్న అన్నాహజారే.!

Sun 25th Sep 2016 08:05 PM
anna hazare,pakistan,war,gun,india,modi  ఇక గన్ను పట్టాల్సిందేనన్న అన్నాహజారే.!
ఇక గన్ను పట్టాల్సిందేనన్న అన్నాహజారే.!
Advertisement

యూరీపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారత సైన్యం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని బారత్ తో పాటు పలు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్తాన్ తీరుతో భారత్ లోని యువత కూడా మండిపడుతుంది. కాగా ఇప్పుడు పాక్ తీరును ఖండిస్తూ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే కూడా తీవ్రంగా మండిపడ్డాడు. పాక్ తో కనక యుద్ధమే చేయాల్సి వస్తే అందులో తాను పాల్గొంటానని, ఆ పరిస్థితే వస్తే తీవ్రం నష్టం జరుగుతుందని, అంతటిదాకా తెచ్చకోకుండా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఆయన అన్నాడు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ అన్నా హజారే ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ పై యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే తాను పాక్ పై జరిపే యుద్ధంలో పాల్గొంటానంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. చాలా సున్నితమైన.... అదేవిధంగా జఠిలమై కూర్చున్న ఈ సమస్య చాలా మెలకువతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ కళాకారులను దేశం విడిచి వెళ్ళాలని నవ నిర్మాణ సేన హెచ్చరికలు జారీ చేయడంపై ఆయన స్పందించాడు. యుద్ధం వేరు, కళ వేరు రెండింటినీ ఈ విధంగా తీసుకురావడం తప్పు. కళలు మానవ జాతి ఆనందానికి స్ఫూర్తినిచ్చేవి కాబట్టి వాటికి ఒక ప్రత్యేకత ఉంది. అలా భావించడం కూడా తప్పు అంటూ ఆయన వెల్లడించాడు. కానీ వాటిని తప్పుడు మార్గంలో ఉపయోగించడమే ఇక్కడ సమస్య అని ఆయన వివరించాడు. పాక్ తో యుద్ధమే గనక వస్తే తానూ గన్నుకు పదును పెట్టాల్సి వస్తుందని అంతవరకు రాకుండా చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాడు. కాగా ఈ విషయంపై ప్రధాని మోడీ కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. భారత్ తో పాకిస్తాన్ యుద్ధమే కనక కోరుకుంటే అందుకు మేమూ సిద్ధమేనంటూ పాక్ ను హెచ్చరించాడు.  ఈ మాటలతో అన్ని దేశాలను మోడి ఆలోచనలోకి నెట్టాడు. యుద్ధమే తథ్యం అంటే అందుకు భారత్ సిద్ధం అంటూ ఏమాత్రం తగ్గకుండా మోడి పాక్ ను హెచ్చరించాడు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement