Advertisementt

కీర్తి అస్సలు తగ్గట్లేదు....!

Sun 25th Sep 2016 07:44 PM
keerthi suresh,super hits,lucky heroine,nenu sailaja movie,nenu local movie  కీర్తి అస్సలు తగ్గట్లేదు....!
కీర్తి అస్సలు తగ్గట్లేదు....!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది జనవరి1వ తేదీన వచ్చిన రామ్‌ చిత్రం 'నేను. .శైలజ' చిత్రంతో పాటు ఆమె తమిళంలో నటించిన 'రజనీ మురుగన్‌' చిత్రాలు సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో అప్పటి వరకు కేవలం మలయాళంకే పరిమితమైన కీర్తిసురేష్‌ ఒక్కసారిగా స్టార్‌ అవతారం ఎత్తింది. ఈ చిత్రాల తర్వాత ఆమె తెలుగులోనే కాక తమిళంలో కూడా విజృంభించింది. అలాగని ఆమె వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్‌ డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రంలో మొదటి కీర్తిసురేష్‌నే సంప్రదించారు. కానీ వాస్తవానికి ఏమి జరిగిందో తెలియదు కానీ ఆమె ఆ చిత్ర అవకాశం వదలుకుంది. కాగా ప్రస్తుతం ఈమె నాని హీరోగా దిల్‌రాజు నిర్మిస్తున్న 'నేను లోకల్‌' అనే చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. అలాగే తమిళంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న 'భైరవి' చిత్రంలో కూడా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందునున్న చిత్రంలో  రెండు భాషల్లోనూ కీర్తి సురేష్‌నే హీరోయిన్‌గా ఎంచుకున్నారని తెలుస్తోంది. రెండు భాషల్లోనూ క్రేజ్‌ ఉన్న కారణంగానే ఆమెకు ఈ అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది మార్చి నుండి ఈ చిత్రం రెగ్యులర్‌షూటింగ్‌ మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో కీర్తి, అల్లు అర్జున్ పక్కన నటించనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ