Advertisementt

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నాడు....!

Sun 25th Sep 2016 07:39 PM
arvind swamy,glamour hero,super look,villain,dhruva villain,6 movies  సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నాడు....!
సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నాడు....!
Advertisement
Ads by CJ

1990 లలో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకుల చేత, మరీ ముఖ్యంగా యువతులలో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న నటుడు అరవింద్‌స్వామి. నేటితరంలో మహేష్‌బాబులాగా లేడీ ఫాలోయింగ్‌తో ఈయన బాక్సాఫీస్‌ను అదరగొట్టాడు. 'రోజా, బొంబాయి, సూర్యపుత్రులు' వంటి వరస చిత్రాలతో ఆయన నాటి తరం ప్రేక్షకులకు డ్రీమ్‌ బాయ్‌గా అందరికీ తెలుసు. కాగా ఆయన ప్రస్తుతం 'తని ఒరువన్‌' చిత్రంలో నటించి విలన్‌గా కూడా మెప్పించాడు. ప్రస్తుతం ఆ 'తని ఒరువన్‌' రీమేక్‌గా తెలుగులో రామ్‌చరణ్‌ నటిస్తున్న 'ధృవ' చిత్రంలో కూడా ఆయనే విలన్‌గా నటిస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన తమిళంలో అరడజను చిత్రాలతో బిజీ అయిపోయాడు. అలాగే త్రిష నటిస్తున్న 'సత్తురంగ పెట్టై 2' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదటి పార్ట్‌ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అరవింద్‌స్వామి ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా.... ఇలా అన్ని రకాలైన పాత్రలు పోషిస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన సినిమాకి 2 కోట్లు పారితోషికంగా తీసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు. మరలా ఆయన తన మొదటి గ్లామర్‌ లుక్‌తో ఈతరం ప్రేక్షకులను కూడా మైమరిపిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ