ఎం. ఎస్. ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి, భారత క్రికెట్ కెప్టెన్ ధోని కలిసి ఆడియో ని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ధోనిని ప్రశంసలతో ముంచెత్తాడు. భారత్ మాత్రమే కాకుండా ప్రపంచమంతా క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ కూడా 2011లో ప్రపంచ కప్ సాధించిన ఆనందంలో భావోద్వేగాలను ఆపుకోలేక పోయారని, ధోనీ మాత్రం ఆపుకోగలిగాడని, నిజంగా ధోని కర్మ యోగి అంటుూ కితాబిచ్చాడు.
భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది. నీ పని నీవు చేయి, ఫలితం ఆశించకుండా అది చెయ్యి అని దాన్ని పక్కగా ఆచరిస్తాడు ధోనీ అని రాజమౌళి పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ గెలిచిన ఆనందంతో దేశమంతా సంబురాల్లో మునిగి తేలుతుంటే... ధోని మాత్రం కప్ సహచరులకు అందించి తాను పక్కనే నిలబడ్డాడని అంతటి గొప్ప ఘనమైన స్వభావం ధోని సొంతం అంటూ రాజమౌళి వివరించాడు. కానీ తాను ధోని చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటున్నానని మనసులో విషయాన్ని బయటపెట్టాడు. కాగా ధోని మాట్లాడుతూ రాజమౌళి చేసిన బాహుబలి చిత్రం చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది అంటూ తెలిపాడు. మొత్తానికి ఉభయులూ బాగానే పొగుడుకున్నట్లుగా దీన్ని బట్టి తెలిసిపోతుంది.