బాపు దర్శకత్వంలో నటించిన అలనాటి హీరోయిన్ సంగీత.. తెరాసాలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అప్పట్లో హీరోయిన్ గా చేసిన సంగీత ఇప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాపు గీసిన చిత్రాన్ని గానీ, సరికొత్త రీతిలో బాపు చూపించిన హీరోయిన్ ను గానీ వీక్షకుడు అంత తేలికగా మర్చిపోలేడు అది అంతే. ఎందుకంటే బాపు ఎంత అందంగా గీస్తారో. అంతే అందంగా ఫిల్మ్ లో ప్రజెంటు చేస్తారు కూడాను.
బాపు చిత్రాల్లో ఆణిముత్యం అనదగిన చిత్రం ముత్యాలముగ్గు. ఈ చిత్రంలో సంగీత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంగీత తెరాసలో చేరేందుకు సిద్ధమవుతోందని తెలుస్తుంది. కాగా ఇప్పటికి సంగీత అన్ని భాషల్లో కలిసి దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఒక్క తెలుగులోనే 200 చిత్రాలకు పైగా నటించింది. చిత్రాలలో ఆమె పాత్రలో పోషించడం కాదు జీవిస్తుందంటారు సినీజనం. కాగా సంగీత టిఆర్ ఎస్ లో చేరి సినిమా రంగ సంబంధమైన పదవులను అనుభవించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.