కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అదే పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి జైపాల్ రెడ్డిపై ఒక్కసారిగా విమర్శలు గుప్పించాడు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పెద్దమనిషి అని రాసుకుపూసుకు తిరిగిన నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విబేధాలు పొడసూపుతున్నాయి. అధికారం కోల్పోయామన్న ప్రస్ట్రేషన్ లో ఆయా నాయకులు సమయం దొరికనప్పుడంతా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూనే ఉన్నారు.
తాజాగా జైపాల్ రెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్ద సవాల్ విసిరాడు. రాష్ట్ర విభజన సమయంలో నేను రాసిన పుస్తకంలో ప్రస్తావించిన అంశాలను తప్పు అంటున్నారు కదా, అయితే అసలు నిజమేంటో అక్కడ లోపల ఏం జరిగిందనేది మీరే మీ నోటిగుండానే చెప్పమంటూ ఉండవల్లి, జైపాల్ రెడ్డికి సవాల్ విసిరాడు.
ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా అక్కడ స్పీకర్ చాంబర్‌లో సుష్మాస్వరాజ్, కమల్ నాథ్ మధ్య రాజి కుదుర్చానని మీరే మీ నోటిగుండానే చెప్పారు కదా, అలాంటప్పుడు అక్కడేం జరిగిందన్న నిజాన్ని మీరు ఇప్పటికైనా బయట పెట్టండి అంటూ ఉండవల్లి డిమాండ్ చేశాడు. ఇంకో విషయం ఏంటంటే రాజ్యసభలో చిరంజీవి వెల్ లో ఉండగా ఓటింగ్ ఎలా నిర్వహించారంటూ ఉండవల్లి మండిపడ్డాడు. అసలు విభజన బిల్లే పాస్ కాలేదని, కాంగ్రెస్, భాజపా కలిసినా మెజారిటీ లేదనీ, ఓటింగ్ ఏమీ లేదని జైపాల్ సలహా ఇచ్చాడని ఉండవల్లి ఆరోపించాడు. కాగా ఇప్పడు అధికారంలో లేని సమయంలోనైనా ప్రజలకు అసలేం జరిగిందన్న నిజాలు బయటకు వెల్లడిస్తే బాగుంటుందని ఉండవల్లి డిమాండ్ చేశాడు. లోపల జరిగిన కుతంత్రాలు వంటివి ప్రజలు ప్రత్యక్షంగా చూడలేకపోయినా అసలేం జరిగిందన్న వాస్తవం బాగా తెలుసని ఉండవల్లి వివరించాడు.