రాశి ఖన్నా టాలీవుడ్ లోకి ప్రవేశించి అతితక్కువ సమయం లోనే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె ఈ మధ్యన నటించిన 'బెంగాల్ టైగర్, సుప్రీం' సినిమాలు హిట్ అయ్యాయి. ఇక అమ్మడు బాగా బిజీ హీరోయిన్ అయిపోయి పెద్ద హీరో ల పక్కన ఛాన్స్ కొట్టేస్తుందని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఆమె 'బెంగాల్ టైగర్' లో బాగా బొద్దుగా... లడ్డులా కనిపించింది. ఆ సినిమాలో నటించిన తమన్నా కంటే రాశి బొద్దుగా కనిపించిందని... అందుకే తమన్నా పక్కన తేలిపోయిందని అందరూ కామెంట్స్ చేశారట. అందుకే ఆమె కి సరైన ఆఫర్స్ రాక చిన్న చిన్న హీరోల పక్కన చేస్తూ ఉండిపోయిందని అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఆ కామెంట్స్ కి బాగా రియాక్ట్ అయిన రాశి బాగా వర్కౌట్స్ చేసి తన ఒళ్ళు తగ్గించేసుకుని నాజూగ్గా మారిపోయింది. అలా నాజూగ్గా మారిన ప్రయోజనం లేదనుకుందేమో... అందుకే గ్లామర్ డోస్ కూడా కొంచెం పెంచేసింది.
తాజాగా ఆమె రామ్ కి జోడి గా 'హైపర్' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా లో రాశి చాలా హాట్ గా కనిపించనుందని ఆ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ చూసిన వాళ్లకి అర్ధమైపోతుంది. ఇక సినిమాలోనే అలా ఉంటే తాజాగా జరిగిన 'హైపర్' వేడుక లో రాశి తన అందాలను రాసులు పోసి హాజరై మతులు పోగెట్టేసిందంటే నమ్మండి. మారి రాశి అలా తన అందాలను చూపిస్తూ డ్రెస్ చేసుకుని విపరీతమైన హాట్ లుక్ లో అందరికి దర్శనమిచ్చింది. ఇక రాశి అందాలు చూసి అందరూ ఆమె నుండి చూపుతిప్పుకోలేక పోయారంట. ఇంకేముంది అందాల ఆరబోతలో రాశి ని మించిన వాళ్ళు లేరనే టాక్ స్ప్రెడ్ అయిపోయిందట. మరి సినిమా ఇండస్ట్రీలో కొంత కాలం నిలబడాలంటే ఈ మాత్రం చూపించాలిగా అని అనుకుందేమో అమ్మడు. ఏది ఏమైనా రాశి ఇలా నేను దేనికైనా రెడీ అని చెప్పకనే చెప్పి ఆఫర్స్ పట్టెయ్యడానికి సిద్ధమై పోయిందనే చెప్పాలి. మరి రాశి ఆశలు ఫలించి మంచి మంచి అవకాశాలు వస్తాయంటారా..!