Advertisementt

శ్వేతాబసు అతనితో డేట్ నిజమేనంటోంది!

Sat 24th Sep 2016 09:02 PM
swethabasu prasad,rohit mittal,dating,swetha basu date with rohit mittal  శ్వేతాబసు అతనితో డేట్ నిజమేనంటోంది!
శ్వేతాబసు అతనితో డేట్ నిజమేనంటోంది!
Advertisement
Ads by CJ

అప్పుడెప్పుడో 'కొత్త బంగారు' లోకం అంటూ పలకరించిన శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందా...! గుర్తుండే ఉంటుంది. ఈ మధ్యన పాపం బ్రోతల్  కేసులో ఇరుక్కుని...మీడియాకి అడ్డంగా దొరికిపోయింది. ఇక మీడియాలో ఆమెను తెగ చూపించేసారుగా. ఇక తర్వాత మీడియా కి చిక్కకుండా కొన్ని రోజులు అజ్ఞాతం లోకి వెళ్లిన శ్వేత ఇప్పుడు తరుచూ వార్తల్లోకొస్తుంది. ఆమెను మీడియా ఎప్పుడు పలకరించినా కూడా ఆ బ్రోతల్ కేసు గురించే మాట్లాడడం వల్ల ఆమె చాలా కాలం మీడియాకి కనిపించలేదంట. అసలు హీరోయిన్ గా ఛాన్స్ లు రాక ఆమె అలా తప్పుదారి పట్టిందని.. ఇక ఆ కేసుల తర్వాత.... మా సినిమాల్లో ఛాన్స్ ఇస్తాం అంటే మా సినిమాలో ఛాన్స్ ఇష్టం అని టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ కొంతమంది ఆమెకు వాగ్దానం కూడా చేశారు. కానీ తర్వాత ఆమెను పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎదో వాళ్ళ పబ్లిసిటీ కోసం అలా మీడియాలో చెప్పారు గాని ఆమెకు ఫెవర్ చేద్దామని మాత్రం ఎవరికీ లేదు. ఇక శ్వేతా అటు బాలీవుడ్ లో కొంచెం బిజీ గా మారి... ఇక్కడ తెలుగులో ఒక టీవీ ఛానెల్ లో 'సూపర్' అనే రియాలిటీ షో లో పాల్గొంటూ బిజీ గా మారింది.

ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్ లో 'బద్రీనాథ్ కీ దుల్హానియా' సినిమా తోపాటు..... ఓ హిందీ సీరియల్‌లో నటిస్తోంది. అయితే ఆమె బాలీవుడ్ ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్‌తో డేటింగ్‌లో ఉందని అంతా అంటున్నారు. వీరిద్దరి డేటింగ్ పై చాలా కాలం నుండి వార్తలొస్తున్నాయి. అయితే అమ్మడు శ్వేత ఈ  డేటింగ్ వార్తలు నిజమేనని ఒప్పుకుంది. ఫాంటమ్ ఫిల్మ్స్‌లో రోహిత్‌ని కలిసినప్పటి నుంచి తమ రిలేషన్ మొదలైనట్టు తెలిపింది. మేమిద్దరం గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నామని చెబుతోంది. అయితే పెళ్లి మాత్రం ఇప్పుడే చేసుకోమని... ఈ  రిలేషన్ షిప్ మాకు బాగుందని... అందుకే  పెళ్లి  గురించి  ఆలోచించడం లేదని చెప్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ