అరకు ఎంపీ కొత్తపల్లి గీత భూవివాదం చుట్టుముట్టి దిమ్మతిరిగిపోయేలా కేంద్రం చుట్టూ తిరుగుతుంది. ఆమె వైసీపీ తరఫున గెలిసి తెదేపాలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుండే ఆమెకు కష్టాలు మొదలై నిత్యం ఏదో ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలుస్తుంది. అప్పట్లోనే ఆమె తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆరోపించి సంచలనం రేపింది. ఆ తర్వాత ఇప్పుడు ఆమె తెలంగాణ రాష్ట్రంలోని భూముల వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఈ మధ్య హైదరాబాద్ లోని తన భూములను తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించుకుందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెదేపాలో ఉండే ఎవరూ పట్టించుకోవడం లేదని భాజపా కేంద్రంలో బలంగా ఉందని ఆ రకంగా అన్నీ సాధించుకోవచ్చని భాజపాలో చేరే ఉద్దేశంలో ఉందన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
కాగా తెలంగాణలో తాను కొనుగోలు చేసిన భూములను తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించుకుందని రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే కొత్తపల్లి గీత ఆ భూములను కొనుగోలు చేయలేదని, అవి ఆమె ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆక్రమించిన భూములని అదుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ జీహెచ్ ఎంసీ అధికారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా రాజ్ నాధ్ సింగ్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య పలు జాతీయ స్థాయి పత్రికల్లో కూడాను గీత అక్రమ భూములను కలిగి ఉన్నదంటూ పలు కథనాలు కూడా వచ్చినవి. దీనికి స్పందిస్తూ ఈ భూములు తాము కొన్నవేనని, అందుకు తగిన ఆధారాలు పత్రాలతో సహా ఉన్నాయంటూ గీత వాదిస్తుంది. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వమా, గీతను ఎవరు గెలుస్తారో తెలియాల్సి ఉంది.