Advertisementt

నిమ్మగడ్డ చుట్టూ బహమాస్ ఉచ్చు..!

Sat 24th Sep 2016 05:59 PM
bahamas leaks,nimmagadda prasad,telugu states,bahamas,nimmagadda team  నిమ్మగడ్డ చుట్టూ బహమాస్ ఉచ్చు..!
నిమ్మగడ్డ చుట్టూ బహమాస్ ఉచ్చు..!
Advertisement

తాజాగా బహమాస్ సంచలనం రేపుతుంది. రహస్యంగా కార్యకలాపాలు చేసుకుంటూ పోతున్న లక్షల కంపెనీల లోగుట్టు బయటపడుతుంది. ఇందులో దాదాపు 25కంపెనీలకు పైగా తెలుగు వారివి ఉన్నాయంటే నమ్మలెేని నిజం. కాగా ఒకే అడ్రస్ తో పాతిక కంపెనీలు సూట్ కేసు కంపెనీలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కాగా బ్లాక్ మనీని విదేశాలకు తరలించి అక్కడ నుండి వైట్ చేసుకొని తెచ్చుకోవడం అన్నది ఇందులో ప్రధాన పాత్ర పోషించే అంశం. అయితే చాలా కాలం నుండి దొంగ డబ్బును బహమాస్ లో నిల్వచేసుకొని అవసరానికి స్వదేశాలకు తెచ్చుకోవడం అనేది అనాదిగా జరుగుతున్న తంతే. కానీ ఆ విషయం ఆ గుట్టు ఇప్పుడు రట్టవుతుంది.  

ప‌నామా ప‌త్రాల సంచ‌ల‌నం మ‌ర్చిపోక‌ముందే బ‌హ‌మాస్ లీకేజీ అంటూ మ‌రో వార్త ఇప్పుడు సంచలనానికి దారితీస్తుంది. ఇందులో ముఖ్యంగా ప్రముఖ పారిశ్రామిక‌వేత్త‌లైన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌కాశ్ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తం 475 మంది భార‌తీయుల పేర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా తెలుగువాళ్ల‌కు సంబంధించే 25 కంపెనీల పేర్లు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వ్యవహారాన్ని నెరపుతున్న 1.75 ల‌క్ష‌ల మంది పేర్లు బైట‌ప‌డుతున్నాయి. వేదంత గ్రూప్ అనీల్ అగ‌ర్వాల్‌, ఫ్యాష‌న్ టీవీ ప్ర‌మోట‌ర్‌ అమ‌న్ గుప్తా పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా సికింద‌రాబాద్‌కి చెందిన ఒకే అడ్రెస్‌పై మొత్తం 25 కంపెనీలు బ‌హ‌మాస్‌లో పెట్ట‌డం సంచ‌ల‌నాంశంగా మారింది.

అయితే ఈ కంపెనీలన్నీ కేవ‌లం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు స్థాపించిన కంపెనీలే. దాన్ని బట్టి ఈనెల 30 లోగా కేంద్రం న‌ల్ల‌కుబేరుల‌పై ద‌ర్యాప్తు జ‌రిపించ‌డం ఖాయమన్నట్లుగానే వార్తలొస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా నిమ్మ‌గ‌డ్డ కుటుంబం పేర్లు వినిపించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ముందు ముందు ఎలాంటి ఆస‌క్తిక‌రమైన అంశాలు వినాలో వేచి చూడాల్సిందే.   అయితే వీరికి కేంద్రప్రభుత్వం ఓ సడలింపు ఇచ్చింది. న‌ల్ల‌కుబేరులు కంపెనీలు పెట్టుకొని..  అందులో 40 శాతం టాక్స్ చెల్లిస్తే ఆ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టినా చ‌ర్య‌లు ఉండ‌వ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే ఓపెన్‌గా వ‌చ్చి ఆ బ్లాక్ మనీదారులు వారంతట వారే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ముందు త‌మ‌కు తాముగా పేర్లు బైట‌పెట్టాలి. ఆ త‌ర్వాత ప‌న్ను చెల్లించాలి. అప్పుడు ఆటోమేటిగ్గా అవ‌న్నీ ప‌బ్లిక్ కంపెనీల‌వుతాయి. అప్పుడు ఎలాంటి సమస్యా ఎదురుకాదని కేంద్రం తేల్చి చెప్పింది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement