తెలుగు, తమిళం, కన్నడ, మలయాళమే కాకుండా అన్ని భారతీయ భాషలలోనూ పాటలు పాడిన లెజండరీ సింగర్ ఎస్ జానకి. జానకి పాట వీనులకు విందుగా ఉంటుంది. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు పాటను తేనెలో ముంచి అందించిన స్వరం జానకి సొంతం. కాగా ప్రేక్షకులందరికీ ఒక్కసారిగా జానకి షాక్ ఇచ్చే వార్తను తెలిపింది. ఈ లెజెండరీ సింగర్ ఎస్ జానకి తన రిటైర్మెంట్ ను ప్రకటించింది. సుమారు 60 సంవత్సరాలుగా దాదాపు 48 వేలకు పైగా పాటలను పాడి సినీ సంగీత అభిమానులను మంత్రముగ్దులను చేసింది. కాగా వయో భారం కారణంగా గాయనిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఎస్ జానకి తెలియజేసింది. తాను చివరగా పాడిన మలయాళ పాట అయిన అమ్మాపోవిను అనే పాటను రికార్డ్ చేశారు. అనూప్ మీనన్, మీరా జాస్మిన్ కాంబినేషన్ లో 10 కాల్పనికాల్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో చివరిగా పాడిన ఈ పాటను తనకు నచ్చిన పాటగా చెప్పింది జానకి. ఈ సందర్భంగా జానకీ, ఇకపై పాటలు పాడదలుచుకోవడం లేదని ప్రకటించేసింది. కారణం మాత్రం వయోభారమేనని వెల్లడించింది. ఇక నుండి సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదంటూ వివరించింది.
జానకి కోకిల వంటి తన గాత్రంతో ఆలపించిన ఎన్నో పాటలు సంగీతాభిమానులకు వీనుల విందు చేస్తున్నాయి. ఎస్ జానకి సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నది.