Advertisementt

వెంకీ.. కఠోర శ్రమే కారణమంట!

Sat 24th Sep 2016 02:27 PM
venkatesh,guru movie,graphics,victory venkatesh,venki physic  వెంకీ.. కఠోర శ్రమే కారణమంట!
వెంకీ.. కఠోర శ్రమే కారణమంట!
Advertisement
Ads by CJ

వెంకటేష్ హీరో గా 'గురు' సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'సాలా ఖద్దూస్‌'ని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు కానీ ఫస్ట్ లుక్ ని.... అప్పుడే విడుదల చెయ్యడమే కాదు....ఆ ఫస్ట్ లోక్ లో సినిమా ప్రారంభ రోజు... ఇంకా రిలీజ్ డేట్ ని కూడా చెప్పేసి అందరిని  ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ బాక్సర్ గా కనిపించనున్నాడట. అయితే పోస్టర్ లో వెంకీ ని చూసిన వాళ్లంతా ఇది వెంకటేష్ అసలు ఫోటో కాదని... గ్రాఫిక్స్ తో ప్రేక్షకులని బురుడి కొట్టించారని అంటున్నారట. అయితే వారు భావించినట్లు అదేదో గ్రాఫిక్ మాయాజాలం కాదని.. ఇది వెంకీ ఒరిజినల్ లుక్ అని ఆ చిత్ర యూనిట్ చెబుతుందట. ఐతే దీనికోసం వెంకటేష్ చాలా శ్రమ తీసుకున్నాడట. శ్రమ అంటే  ఆయన ప్రత్యేకించి ఈ సినిమా కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఈ సినిమాని చెయ్యాలని వెంకీ ముందే డిసైడ్ అయ్యి 'గురు' సినిమాలో పాత్రకి తగ్గట్టు రెడీ అవ్వాలని వెంకటేష్ 9 నెలల పాటు ఒక ఫిట్నెస్ కోచ్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడట. అందుకే అంత పర్ఫెక్ట్ లుక్ ని ఇవ్వగలిగాడని చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే అంత  ఏజ్ లోను వెంకీ అలా కనబడటానికి అతని కఠోర శ్రమే కారణమని అంటున్నారు. ఇక వెంకీ కు ఉన్న ఈ కమిట్మెంట్ చూసి యూనిట్ సభ్యులే ఆశ్చర్య పోయారట. అయితే గ్రాఫిక్స్ అని చెవులుకొరుక్కున్న వాళ్లంతా ఇప్పుడు వెంకీ ని తెగ మెచ్చుకుంటున్నారని టాక్. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా సుధ కొంగర నే డైరెక్ట్ చేస్తుండగా... బాలీవుడ్ లో నటించిన నటీనటులే నటిస్తున్నారట. ఇక ఒక్క వెంకటేష్ తప్ప మిగిలిన వారంతా పాతవాళ్లే అన్నమాట. ఇక ఈ సినిమాని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందట 'గురు' యూనిట్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ