Advertisementt

స్పెషల్: బాబు ఉనికిని కాపాడేది పోలవరమే!

Fri 23rd Sep 2016 08:11 PM
chandrababu naidu,polavaram project,tdp,andhra pradesh,ycrcp  స్పెషల్: బాబు ఉనికిని కాపాడేది పోలవరమే!
స్పెషల్: బాబు ఉనికిని కాపాడేది పోలవరమే!
Advertisement
Ads by CJ

తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేళ్లపాటు ప్రతిపక్షంతో ప్రజల పక్షాన నిలబడి పోరాటం జరిపి జరిపి సునాయాసంగా అధికారంలోకి వచ్చారు. ఆసందర్భంలో ఆయన  ఎన్నో ఒడిదుడుకుల ఎదుర్కొంటూ పార్టీని నడిపించారు. ఎట్టకేలకు 2014 లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు. కాగా గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో  పలు విషయాలు చంద్రబాబుకు బాగా కలిసొచ్చాయి. తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా కేంద్రం విభజించిన తర్వాత ప్రజలందరికీ దేవుడిలా బాబే బెస్ట్ అంటూ అధికారాన్ని అప్పగించారు. అందుకనే ప్రజల్లో బాబు నూటికి నూరు శాతం విజయం సాధించాడు. అంతేకాకుండా జనసేన తరఫున పవన్, కేంద్రం నుండి మోడీలు బాబుకు మద్దతు ఇవ్వడంతో ఆంధ్రాలో విజయం తేలికైంది. అక్కడ అవినీతి ఓడిపోయి నీతి గెలిచిందన్నారు రాజకీయ విశ్లేషకులు. 

ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్లు ప్రస్తుతం విడిపోయి అనాధగా మారిన ఏపీని సరైన గాడిలో పెట్టేందుకు బాబు చేయని పని లేదు. తన సర్వశక్తులు ఒడ్డి రాష్ట్రం దశాదిశ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ కార్యరూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొన్నటి వరకే కాదు ఇప్పుడు కూడా రాజధాని అంశం సంకటంగానే మారింది. ప్రజలకు ఇచ్చిన రాజధాని నిర్మాణం హామీని తీర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కోర్టులనుండి దెబ్బలు తింటూనే ఆవిధంగా ఈ విధంగా ముందుకు పోతున్నారు. 

ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏపీ ఆర్ధిక పరిస్థితి, కేంద్రం అందించే సహకారం చూస్తున్న సమయంలో ఏపీకి  ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించేంత అవకాశాలే కనిపించడం లేదనిపిస్తుంది ప్రజలకు.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని నిర్మించి తీరాలి. మళ్ళీ బాబు అధికారంలోకి రావాలంటే రాజధాని నిర్మాణంలో విజయం సాధించి తీరాలి. అందులో సందేహం లేదు. ప్రస్తుతం అసలు బాబు పరిస్థితి చూడబోతే ప్రస్తుతం రాబోవు రెండేళ్ళలో రాజధాని ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి ఒక్కటైనా పూర్తి చేసి జనాల్లోకి వెళ్దామనుకున్నారో ఏమో ఈ మధ్య కాలంలో చాలా తీవ్రంగా పోలవరం ప్రాజెక్ట్ చుట్టూతా హెలికాప్టర్లతో చక్కర్ల కొడుతూ అలా దాని కేంద్రంగానే తిరుగుతున్నారు. ఆ దిశగా ఎక్కవ ఏకాగ్రత పెట్టి దాన్ని సాధించే దిశగానే అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకుల భావన.  ఇప్పటికే ప్రతిపక్షమైన వైకాపా చంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చి అమలు చేయని వాటినే ఆయుధాలుగా మలుచుకునేందుకు చూస్తోంది. చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇక పూర్తి చేయక పొతే తెదేపాకి రాబోవు ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని చాలా మంది అంటున్నారు. కాగా మొన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు నిజమే అన్న సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాయి.  రాజధాని అమరావతి పెద్ద భ్రమరావతి అని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన ప్రత్యేక  ప్యాకేజ్ అంటూ రెండు కుళ్ళిపోయిన లడ్డూలను, కుళ్ళిపోయిన క్యాబేజీలని చూడబోతే ప్రజలకు  అది నిజమేననిపిస్తుంది. అందుకనే బాబు ఇప్పుడు పోలవరంపై పడ్డాడని కూడా ప్రజలు భావిస్తున్నారు. అటు రాజధాని, ఇటు పోలవరంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాబు పరిస్థితి రాబోవు ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూద్దాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ