Advertisementt

రామ్‌చరణ్‌ నయా రూట్‌...!

Fri 23rd Sep 2016 03:39 PM
ram charan,new route,mega power star,ram charan movies  రామ్‌చరణ్‌ నయా రూట్‌...!
రామ్‌చరణ్‌ నయా రూట్‌...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్‌చరణ్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో ఉంది. గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన ఫలితాలను సాధిస్తున్నాయి. దాంతో ఆయన 'మగధీర' తర్వాత మరలా అల్లుఅరవింద్‌ నిర్మాతగా గీతాఆర్ట్స్‌ పతాకంపై తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌ 'ధృవ'లో నటిస్తున్నాడు. ఇక నవంబర్‌ నుండి ఆయన 'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌' వంటి చిత్రాలతో వరసగా రెండు బ్లాక్‌బస్టర్లు కొట్టిన మైత్రి మూవీస్‌ పతాకంపై సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన యువి క్రియేషన్స్‌ బేనర్‌లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చరణ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. మొత్తానికి ప్రేక్షకులకు కొత్తదనం కలిగించే చిత్రాలలో నటించాలని గత అనుభవాల దృష్ట్యా రామ్‌చరణ్‌ భావిస్తున్నాడని అర్దమవుతోంది. మరి ఈ నయా రూట్‌ అయినా చరణ్‌కు కలిసొస్తుందేమో వేచిచూడాల్సివుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ