రాధికాఆప్టే.. తన మాటలతో ఎప్పుడు వివాదాల్లో ఉండే నటి. నిన్నటివరకు న్యూడ్‌ఫొటోలతో కాలక్షేపం చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు సౌతిండియా సినిమా హీరోలను తన మాటలతో డ్యామేజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అమ్మడు మరోసారి దక్షిణాదిహీరోలు, ముఖ్యంగా తెలుగుహీరోలపై తన అక్కస్సును వెల్లగక్కింది. తనను ఓ దక్షిణాది హీరో ఫోన్ చేసి క్యాస్టింగ్ కౌచ్ చేయమన్నట్లు ఆరోపణలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అంటే అవకాశం ఇవ్వడం కోసం పడుకోవడం అన్నమాట. అలా పడుకొని తనకు సెక్స్ మజా చూపిస్తేనే చాన్స్‌లు వస్తాయని ఆ దక్షిణాది హీరో తనను వేధించాడని, ఆ విషయంలో తాను కూడా ఆయన్ను ఫోన్‌లోనే దుమ్ముదులిపి వేశానని ఈమె చెప్పుకొచ్చింది. అందుకే ఇక తాను తెలుగు సినిమాలు చేయడం లేదని చెబుతోంది. రాధికాఆప్టే స్టేట్‌మెంటే కరెక్ట్ అనుకుంటే ఆమె దక్షిణాదిలో 'రక్తచరిత్ర, ధోని, లెజెండ్, లయన్, కబాలి' వంటి చిత్రాలలో నటించింది. 'రక్తచరిత్ర, ధోని' చిత్రాల విషయానికి వస్తే అందులో టాప్‌స్టార్స్ ఎవరు లేరు. ఇక రజనీకాంత్ తాను చూసిన పర్‌ఫెక్ట్ జెంటిల్‌మేన్ అంటూ ఆమె కితాబిచ్చింది. ఇక తెలుగులో ఆమె బాలయ్య సరసన రెండు చిత్రాలు చేసింది. దీంతో బాలయ్యను ఈ వివాదంలోకి లాగే ఉద్ధేశ్యంతోనే ఆమె ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.