కాజల్ ఆ మధ్యన సినిమాలేం చేతిలో లేక ఖాళీ ఖాళీ గా వుంది. ఇక ఈమె కెరీర్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది అని అనుకున్నారు అంతా. అనుకోవడం ఏమిటి... అలా ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ కాజల్ మాత్రం సైలెంట్ గా.... ఆ గాసిప్స్ కి స్పందించకుండా ఉంటూనే బాగా బిజీ తార గా మారిపోయింది. ఇప్పుడు కాజల్ తమిళ్ లో 4, 5 సినిమాలతో బిజీగా ఉండగా... ఇక్కడ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అక్కడ హీరోయిన్ గా ఫైనల్ అవ్వగానే.... 'జనతా గ్యారేజ్' లో ఐటెంగర్ల్ గా కూడా చేసి మెప్పించేసింది. ఇలా కాజల్ ఉన్నట్టుండి బిజీ గా మారిపోయి... కాజల్ పని అయిపొయింది అనే వారందరి నోళ్ళకి అడ్డుకట్ట వేసింది. ఇక ఇప్పుడు చిరు 150 వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' లో హీరోయిన్ గా కాజల్ బిజీ అయినా కూడా ఆమెకు ఐటెం గర్ల్ గా తెగ ఛాన్సులు వచ్చేస్తున్నాయట. మరి 'జనతా గ్యారేజ్' లో కాజల్ తన అందాలతో, డాన్స్ తో కుర్రకారు మతులు పోగొట్టి... యువతకి నిద్ర లేకుండా చేసింది. మరి అలా ఐటెం సాంగ్స్ లో పిచ్చెక్కించిన కాజల్ కి మళ్ళీ అలా ఆఫర్స్ రావడం పెద్ద విషయమేమి కాదు. కానీ ఐటెం సాంగ్స్ చెయ్యడానికి కాజల్ ఒప్పుకోవడం లేదు అని... కేవలం జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం వల్లే అప్పుడు ఒప్పుకుందని... కేవలం హీరోయిన్ గానే చేస్తాగాని ఇలా ఐటెం సాంగ్స్ లో నటించనని కాజల్ చెప్పినట్లు ప్రచారం జరిగింది.
అయితే అసలు విషయం అది కాదంట. కాజల్.. చిరు కి జంటగా 150 సినిమాలో చేస్తుండగా ఇలా ఐటెం సాంగ్స్ లో గనక నటిస్తే 'ఖైదీ నెంబర్ 150' కి వుండే క్రేజ్ తగ్గిపోతుందని ఆ మూవీ డైరెక్టర్ వి.వి.వినాయక్.. కాజల్ కి సూచించాడని అంటున్నారు. అందుకే కాజల్ ఇలా ఐటెం సాంగ్స్ ని రిజెక్ట్ చేస్తుందని చెబుతున్నారు. కానీ అలా వినాయక్ చెప్పింది విని స్పెషల్ సాంగ్స్ కి వచ్చే భారీ రెమ్యునరేషన్ వదులుకోవడం కరెక్ట్ కాదేమో అని ఒక పక్క కాజల్ సన్నిహితులు ఆమెకు నచ్చజెబుతున్నారట. ఇది నిజమా కాదా అనేది కాజల్ క్లియర్ చేస్తే బావుంటుంది.