ఏపీకి ప్యాకేజీని ప్రకటించిన తర్వాత కేంద్ర ఆర్దికశాఖామంత్రి అరుణ్‌జైట్లీని చంద్రబాబు కలిశారు. ప్యాకేజీకి బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్దత కల్పించాలని ఆయన జైట్లీని కోరారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్లి జైట్లీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్ధిక ప్యాకేజీని అందించినందుకు రాష్ట్ర ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మరోపక్క కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్యాకేజీతో సరిపెట్టడాన్ని తప్పు పడుతున్న జగన్ మాత్రం ప్రత్యేకహోదా రాకపోతే ఉద్యోగాలు, స్వయం ఉపాధి రంగాల్లో యువత వెనుకపడతారని, కేవలం ప్రత్యేకహోదా ఇస్తేనే యువతకు మంచి జరుగుతుందని జగన్ సూచిస్తున్నారు. అయితే ప్యాకేజీతోనే సరిపుచ్చే విధంగా కేంద్రం ఉండటం, దానికి చంద్రబాబు ఆమోదం లభించడంతో చంద్రబాబును, టిడిపిని ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తోంది. కానీ జగన్ మరింత ముందుకెళ్లి కేంద్రం ఇలాచేసిందని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి జగన్ జంకుతున్నాడు. తాను మోదీపై విమర్శలు చేస్తే ఇప్పటికే అనేక కేసుల్లో ఉన్న జగన్ బిజెపిని చూసి భయపడుతున్నాడనే చెప్పాల్సి వస్తోంది. దీంతో జగన్ ఇటు చంద్రబాబును టార్గెట్ చేసినా బిజెపిపై మాత్రం విమర్శలు చేయలేకపోతున్నారు.