Advertisementt

కాజోల్, ఐష్, కరీనా.. లా సమంత..!

Fri 23rd Sep 2016 12:23 PM
kajol,samantha,kareena,aishwarya rai,naga chaitanya,samantha inner feelings  కాజోల్, ఐష్, కరీనా.. లా సమంత..!
కాజోల్, ఐష్, కరీనా.. లా సమంత..!
Advertisement
Ads by CJ

ఆ ప్రేమ పక్షులను చూడబోతే చాలా సిగ్గు ఎక్కువగా  ఉంది. ఒక్కో విషయాన్ని చాలా నాన్చుడుగా వెల్లడిస్తుంటారు. అలాగే ప్రకటించుకుంటారేమో ప్రేమలో ఉన్నప్పుడు కూడాను. అలాగే ఉండకపోతే ప్రేమలో మజా ఏముంటుంది చెప్పండి. ఉందా లేదా అన్న తొనికిస లాటలోనే నిజమైన ప్రేమ ఉంటుందంటారు. అది నిజమే. కాగా టాలీవుడ్ హీరో హీరోయిన్లు అయిన నాగ చైతన్య, సమంతలు ఎప్పటి నుండో ప్రేమించుకుంటూ ఈ మధ్యనే పెళ్ళంటూ మెల్లి మెల్లిగా ఊసులు  పెంచుకుంటున్న విషయం తెలిసిందే. 

ప్రేమ చాలా కాలం నుండి సాగుతున్న ఈ మధ్యనే ప్రేమ విషయాన్ని బహిర్గత పరుస్తూ ..య‌స్‌… తాము ప్రేమించుకొంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ వివరిస్తున్నారు. అయితే పెళ్ళెప్పుడు అని అడిగితే వచ్చే సంవత్సరం అంటున్నారే గానీ ఖచ్చితమైన తేదీ తెలపలేకపోతున్నారు. అది మాత్రం దాచేస్తున్నారు. స‌మంత ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో..మా పేరెంట్స్‌కి కూడా మేం ఎప్పుడు పెళ్లి చేసుకొంటున్నామ‌న్న‌ది మూడు నెల‌ల ముందే తెలుస్తుంది. ఇక మీడియాకి ఎందుకు ముందే చెప్పాలి?.. అని చెప్పేసింది.  తానూ, చైతూలు తొలి సినిమా నుంచే మంచి ఫ్రెండ్స్‌మ‌నీ, ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్నామ‌ని సమంత పేర్కొంది. అదే సమయంలో యాంకర్.. నాగ‌చైత‌న్య‌లో మీకు న‌చ్చిన అంశం ఏంటని అడిగినప్పుడు...గంద‌ర‌గోళంగా ఉండే నా జీవితాన్ని స్థిరంగా ఉండేలా స్థిమిత బుద్ధిని కలిగించేలా చేశాడు.  నావ‌కి లంగ‌రు ఎలాగో నా జీవితానికి చైతూ అలా.. అంటూ చెప్పేసింది సమంత. 

చైతూ ఇంకా మాట్లాడుతూ తాను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా నటిస్తానని, నటించడం మాత్రం మాననని వెల్లడించింది. ఇంకా ఆమె చెప్తూ హిందీలో కాజోల్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, క‌రీనా క‌పూర్‌ల‌లాగా న‌టిస్తూనే ఉండాల‌ని ఉంది. అందుకు అడ్డు చెప్ప‌ని కుటుంబంలోకే అడుగుపెడుతున్నా.. అని చెప్పింది స‌మంత‌.  అబ్బో అమ్మడకి సిగ్గు బాగానే  ఉంది గానీ, అది పోయేందుకు చైతూ ధైర్యం చెప్పేస్తున్నట్టుంది. అన్నీ విషయాలు అలా అలా చెప్పేసేస్తుంది. ఇక తమ ప్రేమకు అడ్డు లేదంటూ గడ గడ మాట్లాడేస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ