చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న సినిమా 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా మెగాస్టార్ చిరు 150 వ చిత్రం గా తెరకెక్కుతుంది. ఈసినిమాని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. చిరంజీవి వయస్సు ఇప్పటికే 61 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన యంగ్ హీరోయిన్ కాజల్ తో జత కడుతున్నాడు. ఇక ఈ సినిమాలో మెగా కుటుంబం అంతా ఒక సీన్ లో కనిపిస్తారని.... మెగా డాటర్ నిహారిక ఒక స్పెషల్ రోల్ చేస్తుందని అంటున్నారు. అయితే వి.వి.వినాయక్ 'ఖైదీ నెంబర్ 150' లో ఒక స్పెషల్ ఉంటే బావుంటుందని... దాని కోసం ఎవరైతే బావుంటుందా అని సెర్చింగ్ మొదలు పెట్టారట. అయితే చిరు 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో తమన్నాతో ఐటెం సాంగ్ చేయిస్తే బావుంటుందని అనుకుని ఆమెని అప్రోచ్ అయ్యారని ఆ మధ్యన ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి శ్రీయ వచ్చి చేరింది. శ్రీయ ఇదివరకే చిరు తో హీరోయిన్ గా చిరంజీవి తో కలిసి 'ఠాగూర్' సినిమాలో చేసింది. ఇక ఇపుడు 'ఖైదీ నెంబర్ 150' లో చిరు పక్కన ఐటెం గర్ల్ గా చేయనుందని సమాచారం. 'ఖైదీ నెంబర్ 150' డైరెక్టర్ వి.వి వినాయక్.. శ్రీయ ని స్పెషల్ సాంగ్ చెయ్యమని సంప్రదించగా దీనికి శ్రీయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. మరి ఇప్పటికే శ్రీయ బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' లో బాలకృష్ణ కి జోడిగా ప్రాధాన్యం వున్న పాత్రలో నటిస్తుంది. మరి అంత ప్రాధాన్యం వున్న పాత్రలో నటిస్తూనే ఇక్కడ 'ఖైదీ నెంబర్ 150' లో ఎలా స్పెషల్ సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుందో అని అందరూ తెగ ఆలోచిస్తున్నారట. ఆలోచించడం ఎందుకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నారేమో అందుకే ఒప్పకుంటుంది అంటున్నారు మరికొంతమంది.ఇదిలా ఉండగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సంక్రాతి బరిలో ఉంటుందని ఆ చిత్ర డైరెక్టర్ క్రిష్ చెబుతున్నాడు. ఇక ఇటు చిరు కూడా 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయడానికి శరవేగం గా షూటింగ్ జరిపిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు గనక సంక్రాతి కి విడుదలైతే ఒక సినిమాలో హీరోయిన్ గా, మరో సినిమాలో ఐటెం గర్ల్ గా శ్రీయ ప్రేక్షకులకి కనబడనుందన్నమాట. ఇలా ప్రముఖం గా హీరోల కెరీర్ లో మైలు రాళ్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రాలలో శ్రీయ నటించడం విశేషమే.