Advertisementt

పవన్ కి నో చెప్పి చిరు కోసం అడ్వాన్స్..!

Fri 23rd Sep 2016 11:48 AM
boyapati srinu,151st movie,allu aravind,dasari narayana rao,chiranjeevi,pawan kalyan,boyapati directs chiru  పవన్ కి నో చెప్పి చిరు కోసం అడ్వాన్స్..!
పవన్ కి నో చెప్పి చిరు కోసం అడ్వాన్స్..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 151వ సినిమాకు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వహించనున్నాడన్న విషయం దాదాపు ఖాయం అయిపోయింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రెండు మూడు రోజులుగా చోటు చేసుకొంటున్న ప‌రిణామాల్నిబ‌ట్టి ఈ విషయం తెలుస్తుంది. కాగా ఈ మధ్య చిరంజీవికి బోయ‌పాటి శ్రీను కథ చెప్పడం, అది చిరంజీవికి బాగా నచ్చడం వంటివి ఇప్పుడు వినిపిస్తున్నాయి.  చిరంజీవికి బోయపాటి శ్రీను చెప్పిన ఆ కథ ఎమా మజా మజాగా నచ్చేసిందట. కాగా చిరుతో సినిమాకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అల్లు అర‌వింద్ వెంటనే బోయ‌పాటికి అడ్వాన్సు కూడా ఇచ్చేశాడని టాక్. అంతే కాకుండా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాకి బోయ‌పాటి నో చెప్పేసినట్లు కూడా టాలీవుడ్ టాక్. అయితే దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న సంస్థ‌లో ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌నుకొంటున్నాడు. అందుకోసం త‌న శిష్యుల‌తో ఓ క‌థ కూడా త‌యారు చేయించిన‌ట్టు తెలిసింది. ఆ క‌థ‌ని బోయ‌పాటి తెర‌కెక్కిస్తే బాగుంటుంద‌ని, అద్భుతంగా వస్తుందని  దాస‌రి భావించి ఆయ‌న‌కి క‌బురు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప‌వ‌న్‌కి త‌గ్గ క‌థ ఒక‌టి నా ద‌గ్గ‌రే ఉంద‌ని, అదైతే చేస్తాన‌ని బోయ‌పాటి ఆసందర్భంలో వెల్లడించాడు. కానీ త‌న‌కి చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ఉందని, ఆసందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారాలను బట్టి ప‌వ‌న్ చిత్రానికి నో చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ చిరంజీవి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతోనే బోయ‌పాటి ప‌వ‌న్ చిత్రానికి నో చెప్పాడ‌ని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే చిరు ప్ర‌స్తుతం చేస్తున్న 150వ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150 పూర్త‌యిన తర్వాతనే  151 వ చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశం  ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ