Advertisementt

చంద్రబాబుపై హరీష్ అలా ఫైర్ అయ్యాడేంటి?

Thu 22nd Sep 2016 06:57 PM
chandrababu naidu,kcr,uma bharathi,harish rao,fire,water issues  చంద్రబాబుపై హరీష్ అలా ఫైర్ అయ్యాడేంటి?
చంద్రబాబుపై హరీష్ అలా ఫైర్ అయ్యాడేంటి?
Advertisement

అటు ఏపీ ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి మధ్యలో కేంద్ర జల శాఖామంత్రి. యవ్వారం జలాలు, నదుల ఆనకట్టలకు సంబంధించి. అయితే అధికారులతో కేంద్రమంత్రి ముఖ్యమంత్రుల సమక్షంలో కూర్చొని ప్రశాంత వాతావరణంలో మాట్లాడుకొంటుండగా ఒక్కసారిగా హరీష్ రావు బాబుపై మండిపడ్డాడు. అసలే ఉద్యమ నాయకుడు అరిస్తే కరిస్తే అనే నాయకుడు అలాంటి ఆయన కేంద్రమంత్రి ఉన్నారని కూడా లెక్కచేయలేదు. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రితో వీరలెవల్లో ఫైర్ అయ్యాడు. తాజాగా కేంద్రమంత్రి ఉమాభారతి సమక్షంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల పంచాయితీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  కేంద్రమంత్రితో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. కాగా సుప్రీం కోర్టు స్పందించి సమావేశం ఏర్పాటు చేసుకొని కేంద్రంతో చర్చలు జరపమని తెలిపింది. దాంతో ఈ సమావేశంప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ స్నేహపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపాడు. దాంతో ఆగ్రహించిన హరీష్ రావు స్నేహంపూర్వకంగా అని పైకి అంటూ తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ అడ్డతగులుతూ, పుల్లలు పెడుతున్నారని మండిపడ్డాడు. పాలమూరు డిండిలను నిర్మించవద్దంటూ మీరు ఎలా అపెక్స్ కౌన్సిల్ లో వాదిస్తారని ప్రశ్నించాడు. స్నేహపూర్వకంగా సామరస్యభావంతో ఆలోచించే వారు అలా చేస్తారా అని మండిపడ్డాడు. 

ఇదే సందర్భంలో తాము ఏపీ ప్రభుత్వానికి ఎంతో సహాయం చేశామని, పలు అంశాలను తెరపైకి తెచ్చాడు. ఇదే సందర్బంలో కేసీఆర్ స్పందిస్తూ హరీష్ ను కూల్ చేసేలా మాట్లాడాడు. కాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రి సమక్షంలో మాట్లాడుతున్న సమయంలో హరీష్ రావు దూకుడు తనంపై అందరూ చెవులు కొరుక్కున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement