Advertisementt

రజిని 'భాషా' డైలాగ్ తో సూర్య సినిమా!

Thu 22nd Sep 2016 05:20 PM
rajinikanth,suriya,tana serinda kutam,bhasha movie dialogue,vignesh shivan,singham 3  రజిని 'భాషా' డైలాగ్ తో సూర్య సినిమా!
రజిని 'భాషా' డైలాగ్ తో సూర్య సినిమా!
Advertisement
Ads by CJ

ఈ మధ్య సూర్య నటిస్తున్న చిత్రాలు సరిగా ఆడటంలేదు. '24'చిత్రం తెలుగులో హిట్‌ అయినా తమిళంలో మాత్రం కేవలం ఓ యావరేజ్‌గా మాత్రమే నిలిచింది. అందుకే తాను కష్టాలలో ఉన్నప్పుడు తనను ఆదుకునే 'సింగం' సిరీస్‌పై సూర్య బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. హరి దర్శకత్వంలో ఆయన చేస్తోన్న 'ఎస్‌త్రీ' చిత్రం ఈ డిసెంబర్‌లో విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత సూర్య ఎవరితో సినిమా చేస్తాడు? అనే అంశం నిన్నటివరకు చర్చనీయాంశంగా మారింది. కాగా సూర్య నటించే తదుపరి చిత్రానికి 'నేనుమ్‌ రౌడీదాన్‌' (తెలుగులో 'నేనూ రౌడీనే') దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈ చిత్రానికి తమిళంలో వచ్చిన రజనీకాంత్‌ 'భాషా' చిత్రంలోని డైలాగ్‌ను ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు. 'భాషా' చిత్రంలో రజనీ చెప్పే 'తానా సెరిందా కూటమ్‌' ను ఎంపిక చేశారు. నా దగ్గర ఉన్న వాళ్లంతా వారంతట వారు వచ్చిన వారే అనే అర్ధంలో ఈ డైలాగ్‌ ఉంటుంది. కాగా మాస్‌ను మెప్పించే ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేయడంతో సూర్య అభిమానులు, మరీ ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ నుంచి ఈ టైటిల్‌కు బాగా రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్ద 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు స్టూడియో గ్రీన్‌ సంస్దతో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ