సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి రెండేళ్లపాటు తిరుగులేకుండా పోయింది. కానీ ఇటీవలి కాలంలో ఆయనకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయనుండటంతో పలు ప్రాంతాల నాయకులు తమతమ పరిధిలోని ప్రాంతాలను కూడా ప్రత్యేక జిల్లాలను చేయాలనీ జనం మండిపడుతూ, తమని ప్రత్యేక జిల్లాగా చేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ బుద్ది చెబుతామంటూ జనగామ, ములుగుతో పాటు పలు చోట్ల తీవ్ర నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. మరో పక్క జనగాంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఓడిపోయింది. మొత్తానికి విభజించి పాలించు, ప్రాంతాయ భేదాలను, ఉద్యమాలను క్యాష్ చేసుకోవాలని చూసే కేసీఆర్‌కు కొత్త జిల్లాల సమస్య ఇప్పుడు మెడకు చుట్టుకొంటోంది. మరోవైపు ఇటీవల కురుస్తున్న వానల వల్ల హైదరాబాద్‌లోని డ్రైనేజీసిస్టమ్ సరిగా లేకపోవడంతో బస్తీకి బస్తీలు నీటమునిగాయి. కేసీఆర్ చేసిన అభివృద్ది ఇదేనా? మీరసలు ప్రజలను పట్టించుకుంటున్నారా? లేదా? అని జంటనగర వాసులు మండిపడుతున్నారు. ఇక తెలుగుదేశం విలీనం విషయంలో హైకోర్టులో కేసీఆర్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికి రెండేళ్లపాటు తిరుగులేకుండా పోయిన కేసీఆర్ ప్రస్తుతం మాత్రం పలు సమస్యలతో తలలు బద్దలు కొంటున్నారు.