కాపు నేత ముద్రగడ పద్మనాభం గతంలో జరిగిన తుని సంఘటన తర్వాత మిగిలిన కాపు నాయకులు, నేతల సూచనలకు అనుగుణంగా త్వరలో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపులలో ఐక్యత తెచ్చి, గ్రామా గ్రామాలకు, పట్టణాలలోని, నగరాలలోని కాపునేతల మద్దతు సంపాదించడంతో పాటు తనను విమర్శిస్తున్న టిడిపిలోని మిగిలిన నాయకుల బండారాన్ని బయటపెట్టి వచ్చే ఎన్నికల్లో తనను సమర్దించని కాపు నేతలకు కాపు ఓట్లు పడకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ముద్రగడ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుస్తోంది. ఇక పాదయాత్రతో పాటు వారానికి ఒకసారి తమ వినూత్న నిరసనలతో కాపు నేతలను, ఇతర నాయకుల సెగ ముఖ్యమంత్రికి, ఇతర కాపు నేతల, టిడిపిలోని అసంతృప్తి వర్గాన్ని మచ్చిక చేసుకొని వారి ద్వారా ముఖ్యమంత్రికి కాపునేతలకు సెగ తగిలేలా చేయాలని ముద్రగడతో పాటు దాసరి ప్లానింగ్ ప్రకారం ఈ విధమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి తుని సంఘటన వల్ల ఉద్యమానికే మచ్చ రాకుండా చేయడానికి కాపు నేతలు సమాయత్తమవుతున్నారు.