దేశంలో ధోని అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. ఒంటి చేత్తో విజయాలను అందించడమే కాదు.. క్రికెట్‌లో భారత టీంను విజయవంతంగా నడిపిన ధోని జీవిత గాధ ప్రస్తుతం బయోపిక్‌గా 'ఎం.ఎస్.ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ' రూపొందుతోంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్బింగ్ చేసుకొని సెప్టెంబర్30వ తేదీన అన్ని భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. కాగాఈ చిత్రంలో ధోనీగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ నటిస్తుండగా, భూమిక మరో కీలకపాత్రలో నటిస్తోంది. కాగా ఇటీవల తెలుగులో విడుదలైన ట్రైలర్ ఇక్కడి ప్రేక్షకులను కూడా బాగా ఆకర్షిస్తోంది. కాగా ఈ నెల 24న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు. గ్రాండ్‌గా జరగనున్న ఈ ఆడియో వేడుకకు ధోనీ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నాడు. ఆయనతో పాటు దర్శకధీరుడు రాజమౌళి తన చేతలు మీదుగా ఈ ఆడియోను విడుదల చేయనుండటం విశేషం. మరి ఈ చిత్రం అన్నిభాషల్లో విజయవంతం అవుతుందా?లేక 'అజార్' చిత్రంలాగా చెడ్డపేరు తెచ్చుకుంటుందా? అనే అంశం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.