Advertisementt

దేవిశ్రీ కి కౌంటర్ ఇవ్వాలనేనా..ఆ లీక్?

Thu 22nd Sep 2016 02:07 PM
gautamiputra satakarni,balakrishna,krish,chiranthan bhatt,devisri prasad,song leak  దేవిశ్రీ కి కౌంటర్ ఇవ్వాలనేనా..ఆ లీక్?
దేవిశ్రీ కి కౌంటర్ ఇవ్వాలనేనా..ఆ లీక్?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ తన 100 వ చిత్రం గా క్రిష్ డైరెక్షన్ లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా శ్రీయ నటించగా... రాజమాతగా, బాలకృష్ణ కి తల్లిగా బాలీవుడ్ నటి హేమమాలిని నటిస్తోంది. అయితే మొదలైనప్పటినుండి వేగం గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిష్ పెళ్లి పనుల వల్ల కొద్దిగా గ్యాప్ తీసుకుంది. ఇక పెళ్లి అవగానే క్రిష్ షూటింగ్ లో ఎంటర్ అవడమూ మళ్ళీ వేగం గా ఈ సినిమా పట్టాలెక్కించడమూ జరిగిపోయాయి. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని గెటప్ ల ఫొటోస్ ఆ మధ్య  నెట్ లో లీక్ అయ్యి మీడియా లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని ఎంపిక చేశారు. కానీ దేవి మాత్రం కొన్ని కారణాల వల్ల  ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. అయితే దేవిశ్రీ తప్పుకున్నదే తడువుగా డైరెక్టర్ క్రిష్ రంగం లోకి దిగి తన తో 'కంచె' సినిమాతో జర్నీ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ని తీసుకున్నాడు. అయితే చిరంతాన్ భట్ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం లో భాగస్వామి కాగానే చాలా ఫాస్టుగా ట్యూన్స్ చేసి దాదాపు 3  పాటలు రికార్డు చేసి 'గౌతమీపుత్ర శాతకర్ణి' యూనిట్ కి ఇచ్చేసాడని... టాక్ నడుస్తుంది.

అయితే ఆ ట్యూన్స్ లో ని ఒక ట్రాక్ లీక్ అయ్యిందని అంటున్నారు. ఆ లీకైన ట్రాక్ అప్పుడే సోషల్ మీడియా లో వైరల్ లా పాకేసిందని ప్రచారం మొదలైంది. ఈ ట్రాక్ లిరిక్స్ విన్నవారు 'గౌతమీపుత్ర శాతకర్ణి' అశ్వమేథ యాగం చేస్తున్నప్పుడు వచ్చే పాటగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఈ ట్రాక్ ని ఎవరు లీక్ చేశారో మాకు తెలియదని 'గౌతమీపుత్ర శాతకర్ణి' యూనిట్ చెబుతుంది. అయితే టెక్నీకల్ టీమ్ నుంచే ఎవరో ఒకరు దీనిని లీక్ చేసుంటారని... దానికి కారణమైన వారిని వదలమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ వాదన ఇలా ఉండగా ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది అదేమిటంటే ఇది కావాలనే చేశారని... దేవిశ్రీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వల్ల... దేవిశ్రీ కి కౌంటర్ పడేలా... మాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ దొరకడనుకున్నావా... చూడు ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని పట్టామో అని దేవి కుళ్ళుకోవాలనే ఈ ట్రాక్ ని లీక్ చేసుంటారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి వుంది. ఆ ట్రాక్ లిరిక్స్ మాత్రం నెట్ లో  హల్ చల్ చేస్తున్నాయని అంటున్నారు. అంత పెద్ద సినిమాకే లీకులు తప్పకపోతే చిన్న సినిమాలను ఎలా కాపాడుకుంటారో మరి...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ