Advertisementt

'మజ్ను' తో నాని మరో లెవల్ కి..!

Wed 21st Sep 2016 09:40 PM
nani,majnu,majnu movie,satellite rights  'మజ్ను' తో నాని మరో లెవల్ కి..!
'మజ్ను' తో నాని మరో లెవల్ కి..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో కొత్తగా అవతరించిన స్టార్‌ నేచురల్‌స్టార్‌ నాని. కాగా ఆయన గత ఒకటిన్న ఏళ్లలో వరుసగా 'ఎవడే సుబ్రహ్మణ్యం' నుంచి నిన్నటి 'జెంటిల్‌మేన్‌' వరకు వరసగా నాలుగు సూపర్‌హిట్లు అందుకున్నాడు. కాగా నాని సినిమాలకు మొదటి నుంచి టీవీ చానెల్స్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయన నటించిన 'అష్టాచెమ్మా, అలా మొదలైంది, పిల్లజమీందార్‌, ఈగ, ఎవడే సుబ్రహ్మణ్యం' వంటి చిత్రాలు టీవీ చానెల్స్‌లో నానికి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. కాగా ప్రస్తుతం నాని 'ఉయ్యాల జంపాల' చిత్రం దర్శకుడు విరించి వర్మతో 'మజ్ను' చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం ఈ శుక్రవారమే భారీ విడుదలకు సిద్దమవుతోంది. నాని గత చిత్రాలలాగానే 'మజ్ను'కు కూడా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ భారీగానే జరిగింది. ఈ చిత్రానికి ప్రచారం కూడా వినూత్నంగా చేస్తున్నారు. కాగా నాని గత చిత్రాలలాగే 'మజ్ను' చిత్రానికి కూడా శాటిలైట్‌ రైట్స్‌ను ఓ చానెల్‌ 4కోట్ల మొత్తానికి సొంతం చేసుకుందని సమాచారం. ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'మజ్ను' చిత్రంలో ఆయన సరసన అను ఇమ్మానియేల్‌, ప్రియశ్రీ నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా హిట్టయితే ఇక నానికి ఆపడం ఎవ్వరి వల్లా కాదు అని చెప్పుకోవాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ